పెదాల పగుళ్లతో తరచూ బాధపడుతున్నారా? అయితే మీరీ క్రీమ్ వాడాల్సిందే!

చలికాలంలో పెదాల పగుళ్లు( Cracked Lips ) ఏర్పడడం సర్వసాధారణం.కానీ కొందరికి సీజన్ తో పని లేకుండా తరచూ పెదాలు పగిలిపోతుంటాయి.

 Homemade Cream For Cracked Lips!,cracked Lips, Homemade Cream, Lip Cream, Latest-TeluguStop.com

పెదాల పగుళ్లు కారణంగా తీవ్రమైన నొప్పికి గురవుతుంటారు.అలాగే చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

ఈ క్రమంలోనే పెదాల పగుళ్లును నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ లిప్ క్రీమ్ ను వాడితే పెదాల పగుళ్లను శాశ్వతంగా వదిలించుకోవచ్చు.

ఈ క్రీమ్ ను వాడటం వల్ల మీ పెదాలు( Lips )మృదువుగా కోమలంగా సైతం మారతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లిప్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బటర్, వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.

ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.అంతే మన లిప్ క్రీమ్ సిద్ధం అయినట్టే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజుకు రెండు నుంచి మూడు సార్లు ఈ క్రీమ్ ను పెదాలకు అప్లై చేసుకోవాలి.తద్వారా పెదాల పగుళ్ళు మాయం అవుతాయి.

అదే సమయంలో పెదాలు కోమలంగా మృదువుగా మారతాయి.అలాగే పెదాల నలుపును వదిలించడానికి కూడా ఈ హోమ్‌ మేడ్ లిప్ క్రీమ్( Homemade Lip Cream )సహాయపడుతుంది.

రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను యూస్ చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లగా ఉన్న పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.కాబట్టి అందమైన మెరిసే మృదువైన పెదాలను కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా ఇంట్లోనే లిప్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube