అబ్బా... అల్లు అరవింద్.. ఈ సారి ఆ అయ్యప్పే నీ కళ్ళు తెరిపించాడు

ప్రతిసారి మ్యాజిక్ చేయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి.కేవలం రెండు కోట్లు పెట్టి కాంతారా అనే సినిమా కొని కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది.

 Allu Aravind Magic Wont Repeat In Malikapuram Movie , Malikapuram Movie , Allu A-TeluguStop.com

మళ్లి అదే మ్యాజిక్ అవుతుంది అని భావించి ఈ సారి బొక్క బోర్లా పడ్డాడు పాపం అల్లు అరవింద్.కాంతారా సినిమా కన్నడ లో సూపర్ హిట్ అయ్యాక సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన మౌత్ టాక్ తెచ్చుకొని తెలుగులో కూడా మారు మోగిపోయింది.

అయినా కూడా చాల తక్కువ రేట్ కి కాంతారా తెలుగు లో అల్లు అరవింద్ చేతికి వచ్చేసింది.

Telugu Allu Aravind, Alluaravind, Bangalore, Kannada, Kantara, Maalikapuram, Mal

సినిమా టాక్ ఒక్కసారి కన్నడ లో తెలియగానే రాత్రికి రాత్రి బెంగుళూరు ఫ్లైట్ ఎక్కి 2 కోట్లు ఇచ్చి సినిమా తెచ్చుకున్నాడు ఇంకాస్త లేట్ అయితే ఆ రేటు బాగా పెరిగిపోయేది.ఇక అదే ఫలితం ఈ సారి మలయాళం లో మ్యాజిక్ చేసిన మాలికాపురం అనే సినిమా కోసం ఊహించి అతి తక్కువ రేటు కి కొని తెలుగు లో విడుదల చేస్తే సరిగ్గా వేలి మీద లెక్క పెట్టేంత మంది కూడా ఒక్క థియేటర్ లో లేరు.ప్రమోషన్ కూడా చేయకుండానే కాంతారా కు వచ్చారు కాబట్టి దీనికి వస్తారు అనుకోని ఒక్క ప్రెస్ మీట్, పోస్టర్ కూడా వదలకుండా థియేటర్ లో కి సినిమా వస్తే ఏమవుతుందో అల్లు బాబు కి అర్ధం అయ్యింది.

పైగా ఈ సినిమా మలయాళం లో వంద కోట్లు కలెక్ట్ అయినట్టు చూపిస్తున్న లెక్కలు పెద్ద కాకి లెక్కలు.

Telugu Allu Aravind, Alluaravind, Bangalore, Kannada, Kantara, Maalikapuram, Mal

ఆలా కొన్ని వెబ్ సైట్స్ లో రాయించి బయట రాష్ట్రాలకు సినిమాను అమ్ముకునే ప్రయత్నం మాత్రమే.తన చేతిలో థియేటర్స్ ఉన్నాయ్ కాబట్టి ఎలా వేసిన నడుస్తుంది అనుకున్నాడు కాబోలు ఈ సారి ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా రాలేదు.పైగా మాలికాపురం సినిమా చాల పెద్ద డివోషనల్ సబ్జెక్టు.

అయ్యప్ప స్వామి మహిమ గురించి తీసిన సినిమా.దేవుడి కోసం ఒక చిన్నారి ఎలా ఇల్లు వదిలేసి వస్తుంది ఆ దర్శనం కోసం సాగే ప్రయాణం లో ఎలా ఇబ్బందులు పడుతుంది అనే విషయం పై సినిమా తీయగా ఇదే సబ్జెక్టు తో తెలుగు లో దేవుళ్ళు అనే పేరుతో ఇక ఆ అయ్యప్పే నీ కళ్ళు తెరిపించాలి అరవింద !

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube