జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

ప్రస్తుతం కరోనా కాలం అని అందరికి తెలుసు.ఇక ఈ సమయంలో అందరూ ఇమ్యూనిటీని పెంచుకొనే పనిలో పడ్డారు.

 Health Benefits Of Jowar Flour, Jowar Flour, Jowar Roti, Diabetes, Bp Control,so-TeluguStop.com

పండ్లు కూరలు మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది.అయితే పూర్వం మన పెద్దలు ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించుకోవడం కోసం జొన్న రొట్టెలు, జొన్న ముద్దలు లాంటివి చేసుకునేవారు.

కాలం మారుతున్న కొద్దీ అలాంటి ధాన్యాలు కనుమరుగైపోతున్నాయి.జొన్న పిండిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్.

అవి ఏంటి అనేది తెలుసుకుందాం.

జొన్నల్లో అధికశాతం ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి.

ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ రేటును పెంచడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

ఈ జొన్నల్లో మెగ్నీషియం క్యాల్షియం అధిక స్థాయిలో ఉండటం వల్ల ఎముకలకు గట్టిదనాన్ని చేకూరుస్తాయి.

Telugu Bp Control, Diabetes, Benefits Jowar, Tips, Immunity, Jowar, Jowar Roti,

అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జొన్న పిండితో రొట్టెలు గాని ముద్దలు గాని తినడం వల్ల ఆ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.

ఇతర ధాన్యాలతో పోల్చితే జొన్నలో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఐరన్, కాపర్ ఈ రెండు జొన్నల్లో కనిపించే అతి ముఖ్యమైన ఖనిజాలు.ఈ ఖనిజాలు శరీరంలో రక్తప్రసరణను మెరుగు పరచడంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.శరీరంలో ఎర్రరక్తకణాల అభివృద్ధికి ఐరన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.అదే సమయంలో రక్త హీనత యొక్క ఆవశ్యకతను తగ్గిస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జొన్నలను రోజుకు ఒక సారి లేదా వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube