రిచా సినిమాలు వదిలేసి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా ?

ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్ల జీవితం మూన్నాళ్ళ ముచ్చటే.ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఎక్కువ కాలం సినిమాలో నటించే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు.

 Richa Pallod Where Abouts , Richa Pallod , Star Heroine , Savitri , Vanishree , Nuvve Kavali Movie , Tarun , Vijay Bhaskar , Chirujallu , Himanshu Bazar-TeluguStop.com

నాటి తరంలో సావిత్రి వాణిశ్రీ లాంటి వాళ్లే దశాబ్దాల పాటు హీరోయిన్స్ గా కొనసాగే వారు.కానీ ఇప్పటి హీరోయిన్లు రెండు లేదా మూడు సినిమాలు మహా అయితే రెండేళ్లు ఇలా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి మాయమవుతున్నారు.

అలా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్లలో చెప్పుకోవాల్సిన హీరోయిన్ రిచా పల్లాడ్. నువ్వే కావాలి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రిచా.

 Richa Pallod Where Abouts , Richa Pallod , Star Heroine , Savitri , Vanishree , Nuvve Kavali Movie , Tarun , Vijay Bhaskar , Chirujallu , Himanshu Bazar-రిచా సినిమాలు వదిలేసి ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న తరుణ్ ఈ చిత్రంతోనే హీరోగా మారాడు.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వే కావలి సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలుసు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి సినిమాకి మాటల మాంత్రికుడు మాటలు కూడా రాశారు.దాదాపు ఈ సినిమా వచ్చి ఇప్పటికే రెండు దశాబ్దాలు గడుస్తోంది.

అయినప్పటికీ ఈ సినిమాకి ఎంతో మంది యూత్ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.ఇప్పటికీ ఈ సినిమాని టీవీలో వచ్చినా కూడా మిస్ అవ్వకుండా చూస్తుంటారు.

తరుణ హీరో అవ్వడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిచా మంచి పేరునే సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత చిరుజల్లు లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయినా రిచా ఆ తర్వాత మరిన్ని సినిమాలు చేసినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి దూరం అయిపోయింది.

ప్రస్తుతం రిచా ఏం చేస్తోంది ? ఎక్కడ ఉంది ? అనే ప్రశ్న ఆమె అభిమానుల్లో తలెత్తుతుంది.బెంగళూరులో పుట్టి పెరిగిన రీచా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది.ఆమె కేవలం తెలుగులోనే కాదు మలయాళ, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2011 వ సంవత్సరంలో హిమాన్షు బజార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

వీరిది పెద్దలు కుదిరిచిన వివాహం ఈ జంటకి ఒక బాబు కూడా ఉన్నాడు.బాబు పుట్టిన తర్వాత మళ్ళీ బిజీ అవ్వాలనుకున్న రీచా 2016లో మలుపు అనే చిత్రంలో రీఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత మళ్లీ పెద్ద బ్రేక్ పడింది.

అలా 2020 వ సంవత్సరంలో యువర్ హానర్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించి రిచా మళ్ళి తన రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.ఈ సిరీస్ కి సీక్వెల్ కూడా ఇటీవల విడుదలవగా ఆ ప్రమోషన్స్లో రీచా కనిపించింది.

కానీ మొదటి కొన్ని సినిమాలో కనిపించినంత అందంగా అయితే లేదు ఈ సిరీస్ లో లుక్స్ చాలా పేల్ గా కనిపిస్తున్నాయి అంతేకాదు ఆమె ఇప్పుడు చూస్తే అసలు గుర్తు కూడా పట్టరు అంతలా మారిపోయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube