రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్( Game Changer ) మూవీ మరో 72 గంటల్లొ థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ లో( Ram Charan Triple Role ) కనిపిస్తారని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
మూడు పాత్రల్లో ఒక పాత్రలో రామ్ చరణ్( Ram Charan ) పాత్రకు నత్తి ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని వినిపిస్తోంది.
రామ్ చరణ్ మూడు పాత్రల్లో కనిపిస్తారంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని కొంతమంది కావాలని ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ కలెక్షన్ల పరంగా కూడా గేమ్ ఛేంజర్ అవుతుందేమో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడానికి అవసరమైన అన్ని ప్లస్ పాయింట్లు ఈ సినిమాకు ఉన్నాయి.
ఈ సినిమాలో అంజలి( Anjali ) పార్వతి అనే పాత్రలో కనిపించనున్నారు.దిల్ రాజు బ్యానర్ లో అంజలి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వకీల్ సాబ్ సినిమాలు సక్సెస్ సాధించగా తర్వాత సినిమాలతో సైతం ఇదే మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ టార్గెట్ 250 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
అన్ని రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది.
గేమ్ ఛేంజర్ సినిమా అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లభిస్తే మాత్రం గేమ్ ఛేంజర్ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.