సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న కూలీ సినిమాపై( Coolie Movie ) భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
కూలీ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైందని రజనీకాంత్ అప్ డేట్ ఇచ్చారు.ఒక జర్నలిస్ట్ తమిళనాడు రాష్ట్రంలో మహిళల భద్రత( Women Safety ) గురించి ప్రశ్నించగా రజనీకాంత్ మాత్రం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
పొలిటికల్ ప్రశ్నలు మాత్రం అస్సలు అడగవద్దని రజనీకాంత్ కామెంట్లు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో( Tamil Nadu ) గత నెలలో ఒక ఘటన జరిగిన నేపథ్యంలో ఆ ఘటన గురించి జర్నలిస్ట్ ప్రశ్నించగా రజనీకాంత్ మాత్రం ఆసక్తి చూపలేదు.
మరోవైపు రజనీకాంత్ కూలీ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.స్టార్ హీరో నాగార్జున( Nagarjuna ) ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం గమనార్హం.
కూలీ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కూలీ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కూలీ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కూలీ సినిమా కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని భోగట్టా.నాగార్జున ఈ సినిమాకు 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.నాగార్జున కెరీర్ కు సైతం ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
లియో సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.