తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్న హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి సందర్భంలో మన స్టార్ హీరోల నుంచి భారీ సినిమాలు రావడం పాన్ ఇండియాలో మంచి విజయాలను అందుకోవడం ఆయా సినిమాల దర్శకులు సైతం సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది విశేషం…ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి( Venky Atluri ) సైతం ఇప్పుడు తెలుగు హీరోల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్నటిదాకా పరభాష హీరోలతో సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు తెలుగు హీరోల మీద తన కన్ను వేసినట్టుగా తెలుస్తోంది.ఇక దానికి తగ్గట్టుగానే హీరోలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఇప్పటికి నాగచైతన్య( Naga Chaitanya ) గారిని కలిసి ఒక కథ కూడా వినిపించారట.ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ( Naga Vamsi ) ఈ సినిమాను నిర్మించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా వెంకీ అట్లూరి గొప్పతనం ఏంటో ఇప్పటికీ మన తెలుగు హీరోలకు తెలిసి వచ్చింది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తెలుగు డైరెక్టర్లు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు సాగుతూ ఉండడం అలాగే మన హీరోలకు సక్సెస్ లను అందించి పెట్టడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…ఇక ఇది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మన తెలుగు హీరోల డామినేషన్ ఎక్కువై పోయిందనే చెప్పాలి…