యూరోపియన్ యూనియన్( European Union ) దేశాల మధ్య సరిహద్దుల్లేని ప్రయాణానికి స్కెంజెన్ జోన్( Schengen Zone ) అనుమతిస్తుంది.ఇప్పుడు బల్గేరియా,( Bulgaria ) రొమేనియా( Romania ) దేశాలు ఈ ప్రాంతంలో అధికారికంగా చేరాయి.
దీంతో ఈ రెండు దేశాల మధ్య ప్రయాణాలు మరింత సులువు కానున్నాయి.ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని హంగరీ-రొమేనియా సరిహద్దులో ఘనంగా వేడుకలు జరిగాయి.
సరిహద్దు గేట్లు తెరుచుకోగానే.ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రాసింగ్‌లు మొదలయ్యాయి.
అయితే ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది.ఎందుకంటే, సరిహద్దు గేటు తెరుచుకోగానే ఒక వీధి కుక్క( Stray Dog ) హంగరీ నుంచి రోమానియాలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆ దృశ్యాన్ని వీడియో తీశారు.
కుక్కపిల్ల హంగరీ వైపు నుంచి రొమేనియాలోకి నడుచుకుంటూ వెళ్తుంటే.పోలీసులు అధికారులు చప్పట్లు కొడుతూ దాన్ని ఆహ్వానించారు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
స్కెంజెన్ ఒప్పందం వల్ల పాస్‌పోర్ట్‌లు, వీసాలు లేకుండానే సభ్య దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు.ఇన్నాళ్లూ ఈ అవకాశం లేని బల్గేరియా, రొమేనియా ప్రజలు ఇకపై స్కెంజెన్ దేశాల్లో ఎక్కడికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లొచ్చు.ఇక ఆ కుక్క సరిహద్దు దాటుతున్న వీడియో చూసిన నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు.
చాలామంది ఆ కుక్క చారిత్రాత్మక సమయంలో భాగమైనందుకు దాన్ని మెచ్చుకుంటున్నారు.ఒక నెటిజన్ అయితే “సరిగ్గా గేటు తెరిచే సమయానికి ఆ కుక్క రావడం, దానికి చప్పట్లతో స్వాగతం పలకడం అద్భుతంగా ఉంది” అని కామెంట్ పెట్టాడు.
నెటిజన్లు ఆ కుక్కపై తమ ప్రేమను కామెంట్ల రూపంలో కురిపిస్తున్నారు.కొందరు దాన్ని “గుడ్ బాయ్” అని పిలుస్తుంటే, మరికొందరు దాన్ని ఎవరైనా దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నారు.ఒక యూజర్ సరదాగా “ఈ కుక్క రొమేనియాకి రాజు అవ్వాలి” అని కామెంట్ చేస్తే, ఇంకొకరు “హంగరీ పోగొట్టుకుంది, రోమానియా దక్కించుకుంది” అంటూ ఫన్నీ కామెంట్ పెట్టారు.
అయితే ఈ సరదా వెనుక ఒక విషాదకరమైన వాస్తవం కూడా ఉంది.
బల్గేరియా, రొమేనియా రెండూ వీధి కుక్కల సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నాయి.హంగరీలో దాదాపు 5 లక్షల వీధి కుక్కలు ఉంటే, రొమానియాలో ఆ సంఖ్య 6 లక్షలు.
విచారకరమైన విషయం ఏంటంటే.హంగరీలో ప్రతీ నెలా దాదాపు 2,000 వీధి కుక్కలు చనిపోతున్నాయి.
ఏదేమైనా, ఆ వీధి కుక్క సరిహద్దులు దాటడం అనేది ఎన్నో ఆశలకు గుర్తుగా నిలిచింది.