164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్... చివరికేమైందో తెలిస్తే?

గ్రీస్‌లో( Greece ) గుండెలు పిండేసే విషాద దుర్ఘటన చోటు చేసుకుంది.కాలిఫోర్నియాలోని( California ) గోలెటాకు చెందిన క్లారా థామన్( Clara Thomann ) అనే 33 ఏళ్ల సైన్స్ టీచర్( Science Teacher ) కన్నుమూశారు.

 Pregnant California Teacher Clara Thomann Dies After Falling During Hike In Gree-TeluguStop.com

ఆమె గ్రీస్‌లోని క్రెటేలో హైకింగ్( Hiking ) చేస్తుండగా ప్రమాదవశాత్తు 164 అడుగుల లోతైన లోయలో పడిపోయారు.అప్పటికే ఆరు నెలల గర్భవతి అయిన క్లారా, క్రిస్మస్‌కు కొన్ని రోజుల ముందు, డిసెంబర్ 23న ఈ దుర్ఘటనకు గురయ్యారు.

క్లారా పార్ట్‌నర్ ఇలియట్ ఫిన్( Elliot Finn ) మధ్యాహ్నం 2 గంటలకు సహాయం కోసం ఫోన్ చేశారు.వెంటనే స్పందించిన 21 మంది ఫైర్‌ఫైటర్లు, ప్రత్యేక సిబ్బంది క్లారా ఉన్న మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు.

ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, ఆమెను సురక్షితంగా రక్షించి రెథిమ్నో ఆసుపత్రికి తరలించారు.అక్కడ ఆమె స్పృహలో ఉన్నప్పటికీ, తీవ్రమైన గాయాలయ్యాయి.తదనంతరం, పుర్రె, ఛాతీ, కాలులో అనేక గాయాలు ఉండటంతో చాన్య జనరల్ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించారు.

Telugu Clara Thomann, Community Grief, Elliot Finn, Fall, Greece, Organ, Pregnan

అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.డిసెంబర్ 29న క్లారా బ్రెయిన్ డెడ్( Brain Dead ) అయినట్లు వైద్యులు నిర్ధారించారు.ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బతకలేదు.

ఆ దంపతులు తమ బిడ్డకు థియోడోరో అని పేరు పెట్టుకోవాలని అనుకున్నారు.క్లారా గొప్ప మనసును చాటుకున్నారు.

ఆమె కోరిక మేరకు అవయవదానం( Organ Donation ) చేశారు.ఆమె గుండె, కాలేయం, క్లోమములను ఏథెన్స్, హెరాక్లియన్ నగరాల్లోని రోగులకు అందించారు.

Telugu Clara Thomann, Community Grief, Elliot Finn, Fall, Greece, Organ, Pregnan

క్లారాను గుర్తుచేసుకుంటూ ఆమె కుటుంబ సభ్యులు క్రెటేకు చేరుకున్నారు.అక్కడ ఆమెతో తమకున్న మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.నవ్వుతూ, ఏడుస్తూ ఆమెను తలుచుకున్నారు.జనవరి 1న క్లారా భౌతికకాయాన్ని ఏథెన్స్‌కు పంపారు.జనవరి 3న ఆమె దేహాన్ని దహనం చేశారు.క్లారా కోరిక మేరకు ఆమె చితాభస్మాన్ని గ్రీస్, టర్కీలలో చల్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

క్లారా మరణంతో ఆమె విద్యార్థులు, సహోద్యోగులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆమెను దయగల ఉపాధ్యాయురాలిగా అందరూ గుర్తుచేసుకుంటున్నారు.క్లారా తమపై చెరగని ముద్ర వేసిందని ఆమె విద్యార్థులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube