ఆడ‌వారిలో వీటి కొరత ఎట్టిప‌రిస్థితుల్లో ఉండ‌కూడ‌దు.. జాగ్ర‌త్త‌!

సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు భ‌ర్త‌, పిల్ల‌ల‌కు సేవ‌లు చేస్తూ.వారి అవ‌స‌రాల‌ను తీరుస్తూ.

 Nutrient Deficiency In Females Should Not Be Under Any Circumstances! Nutrient-TeluguStop.com

ఇంటి ప‌నులు చ‌క్క‌బెడుతూ ఉంటారు.కానీ, త‌మ ఆరోగ్యాన్ని మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోరు.

స‌రైన స‌మ‌యంలో స‌రైన ఆహారాన్ని తీసుకోకుండా.ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.

ఇదే వారి పాల‌ట శాపంగా మారుతోంది.వాస్త‌వానికి పురుషుల కంటే మహిళలకే పోషక విలువలతో కూడిన ఆహారం ఎంతో అవ‌స‌రం అన‌డంలో సందేహ‌మే లేదు.

యవ్వనదశ నుండి గర్భిణీ దశ, పిల్లలకు పాలిచ్చే దశ, మోనోపాజ్‌ దశ ఇలా వివిధ దశల్లో మ‌హిళ‌లు బ‌లంగా ఉండాలి.

అలా ఉండాలీ అంటే.

వారు ఆరోగ్యంపై మ‌రియు తీసుకునే ఆహారంపై శ్ర‌ద్ధ చూపించాలి.అందులోనూ కొన్ని న్యూట్రియన్లు ఎట్టిప‌రిస్థితుల్లోనూ లోపించ‌కుండా చూసుకోవాలి.

అవేంటి అన్న‌ది ఓ లుక్కేసేయండి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది ఆడ‌వారిలో ఐర‌న్ లోపం క‌నిపిస్తుంది.

పీరియడ్స్ టైమ్‌లో వారు ఐరన్ కోల్పోతారు.ఈ ఐర‌న్ లోపం కార‌ణంగా ర‌క్త‌హీన‌త‌, నీరసం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, జుట్టు ఎక్కువ‌గా ఊడిపోవ‌డం ఎన్నో ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అందువ‌ల్ల ఐర‌న్ లోపం రాకుండా.త‌గిన ఆహారం తీసుకోవాలి.

అలాగే కాల్షియం లోపం కూడా ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆడ‌వారిలో ఉండకుండా చూసుకోవాలి.ఎందుకంటే, ఆడ‌వారు ప్ర‌తి రోజు ఎన్నో ప‌నులు చేస్తుంటారు.అలాంటి వారు చురుగ్గా ప‌ని చేయాలంటే.ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా ఉండాలి.

అలా ఉండాలీ అంటే కాల్షియం లోపించ‌కుండా ఉండాలి.ఇక ఆడ‌వారిలో మెగ్నీషియం కొర‌త కూడా ఉండ‌కుండా చూసుకోవాలి.

Telugu Females, Tips, Latest, Deficiency-Telugu Health - తెలుగు హ�

ఎందుకంటే, గుండె సక్రమంగా కొట్టుకోవడం నుండి కండరాలు హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం కీల‌క పాత్ర పోషిస్తుంది.అలాగే శరీరంలో ప్రతి కణానికి మెగ్నీషియం అవస‌రం ఉంటుంది.అందువ‌ల్ల, మెగ్నీషియం పుష్క‌లంగా ఉండే ఆహారాన్ని ఖ‌చ్చితంగా తీసుకోవాలి.ఇక ఆడ‌వారిలో విట‌మిన్‌-డి లోపం కూడా ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.ఎందుకంటే, వారి శ‌రీరంలో విటమిన్-డి లోపిస్తే.ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోయి ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ మ‌రియు ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube