నందమూరి తారక రామారావు.తెలుగు సినిమా పరిశ్రమ ఇంతింతై వటుడింతై అనేలా ఎదిగిపోవడానికి కారణమైన వ్యక్తుల్లో ఒకరు.
ఇవాళ టాలీవుడ్ దేశ సినిమా పరిశ్రమను ఏలే స్థితిలో ఉందంటే దానికి కారణం ఎన్టీఆర్ లాంటి వ్యక్తుల వల్లే అని గర్వంగా చెప్పుకోవచ్చు.వెండి తెర మీదనే కాదు.
నిజ జీవితంలోనూ హీరోగా వెలుగు వెలిగిన వ్యక్తి ఎన్టీఆర్.పని పట్ల ఆయనుకున్న నిబద్దత మరెవరికీ ఉండబోదని చెప్పుకోవచ్చు.
పని దైవంగా భావిస్తాడు ఆ మహానటుడు.షూటింగ్ అంటే.
చెప్పిన సమయానికంటే కాస్త ముందే అక్కడ ఉండేవాడు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న సీన్లు కంప్లీట్ చేశాకే ఇంటికి వెళ్లేవాడు.
దెబ్బలు తగిలినా ఏమాత్రం పట్టించుకోకుండా పని పూర్తి చేసేవాడు.అలా ఆయన తీవ్ర గాయాలైనా సినిమా షూటింగ్ కొనసాగించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.అందులో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1977లో ఎదురీత అనే సినిమా షూటింగ్ జరుగుతుంది.ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది.ఈ సినిమాను బెంగాల్ హీరో ఉత్తమ్ కుమార్ నటించిన ద్విభాషా చిత్రం అమానుష్ ఆధారంగా ఎదురీత సినిమాను తెరకెక్కించారు.
వి.మధుసూదనరావు దీనికి దర్శకత్వం వహించాడు.ఎన్టీఆర్ తో జోడీగా వాణి శ్రీ నటించింది.విలన్ పాత్రలో కైకాల సత్యనారాయణ యాక్ట్ చేశాడు.ఈ సినిమాకు సినిమాటోగ్రఫీతో పాటు నిర్మాణ పార్ట్ నర్ గా విఎస్ఆర్ స్వామి పని చేశాడు.

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం తూర్పు గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లో చేశారు.అందులో భాగంగానే యానాంలో సముద్రంపై ఎన్టీఆర్, సత్యనారాయణ మీద ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు.చిన్న షిప్స్ ట్రాలర్స్ పై ఓ సైడు ఆర్టిస్టులు వెళ్తుండగా.
ఇంకోవైపు కెమెరా టీం వెళ్తూ షూట్ చేస్తున్నారు.ఆ సమయంలో అనుకోకుండా ఓ ఇనుప రాడ్డు ఎన్టీఆర్ ముఖానికి గట్టిగా తగిలింది.
రక్తం బాగా కారుతుంది.అందరూ కంగారు పడ్డారు.
వెంటనే షూటింగ్ ఆపి ఒడ్డుకు చేరారు.అదే సమయంలో అక్కడ ఎవరో మిరపకాయలు ఆరబోశారు.
వాటిలో కొన్ని మిరపకాయలు తీసుకుని నోట్లో వేసుకుని నమిలాడు ఎన్టీఆర్.కాసేపయ్యాక పదండి షూటింగ్ చేద్దామన్నాడు ఎన్టీఆర్.
అందరూ ఆశ్చర్యపోతూ మళ్లీ పని మొదలు పెట్టారు.