సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈమె ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో ఏడడుగులు నడిచారు.
ఇక వీరి వివాహం ( Wedding ) జులై రెండో తేదీ ముంబైలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇలా ముంబైలో వివాహం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నైలో ఎంతో ఘనంగా రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.
ఈ రిసెప్షన్ వేడుకకు పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ( Balakrishna ) ఈ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.అదే విధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులకు కూడా ఈమె రిసెప్షన్ వేడుకలో పాల్గొని సందడి చేశారు.ఈ విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈమె పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఖర్చుకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ తమిళనాట ఓ వార్త సంచలనంగా మారింది.ఇలా పెళ్లి కోసం 200 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇలా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో ఈ వార్తలపై శరత్ కుమార్ స్పందించారు.నా బిడ్డ పెళ్లి కోసం 200 కోట్లు ఖర్చు చేశారంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఆ వార్తలు పూర్తిగా ఆ వాస్తవం అని తెలిపారు.200 కోట్ల ఖర్చు అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ ఈయన పెళ్లి ఖర్చుల గురించి స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.