సినీ నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) ఇటీవల రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రాజకీయ నేపథ్యము ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి ( Mounika Reddy ) ని ఈయన రెండవ వివాహం చేసుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇకపోతే ఇటీవల భూమా మౌనిక మనోజ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా తన కుమార్తె పుట్టిన సమయంలో తనకు కూతురు పుట్టిందని తనకు ముద్దుగా ఎం ఎం పులి అని పేరు పెట్టినట్లు తెలిపారు.అయితే తాజాగా తన కుమార్తె నామకరణ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది.

తాజాగా భూమా మౌనిక మనోజ్ దంపతులు తన కుమార్తె నామకరణ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.అంతేకాకుండా తన కుమార్తె పేరును కూడా రివీల్ చేశారు.తన కూతురికి ఇప్పటికే ఏం ఏం పులి అని ముద్దు పేరు పెట్టిన సంగతి తెలిసిందే.అయితే శివయ్య భక్తులం అయినటువంటి మేము శివయ్య కుటుంబంలో ఒకరైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య దేవసేన పేరును తన కుమార్తెకు పెట్టినట్లు తెలిపారు.
అలాగే తన అత్తయ్య శోభ నాగిరెడ్డి( Sobha Nagi Reddy ) నుంచి శోభ అనే పేరును కలిపి దేవసేన శోభ ఎం ఎం ( Devasena sobha MM ) అని పేరు పెట్టినట్టు తన కూతురి పేరును తెలియజేశారు.

నా కూతురుపై తన అత్తయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే భూమా నాగిరెడ్డి గారి వారసత్వాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు.ఇక నా కుమారుడు ధైరవ్ నాగిరెడ్డి తన చెల్లెల్ని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఈయన తెలిపారు.తన ప్రతి కష్టంలో తనకు తోడుగా నిలిచిన తన తల్లితండ్రులతో పాటు తన అక్కయ్య మంచు లక్ష్మికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా వీరందరి ఆశీస్సులు తన కూతురిపై ఉండాలని కోరుతూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.







