కాక‌ర‌కాయ ర‌సం జుట్టుకు రాస్తే ఎన్ని లాభాలో తెలుసా?

కాకరకాయ.( Bitter Gourd ) ఈ పేరు వెంటనే చాలా మంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంటారు.కారణం దాని రుచి.కాకరకాయ చేదుగా ఉండడం వల్ల ఎక్కువ శాతం మంది దాన్ని తినేందుకు ఇష్టపడరు.కానీ ఆరోగ్యపరంగా కాకరకాయ అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.అలాగే జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా తోడ్పడుతుంది.

 Do You Know The Benefits Of Applying Bitter Gourd Juice On Hair Details, Bitter-TeluguStop.com

కాకరకాయ రసాన్ని( Bitter Gourd Juice ) జుట్టుకు రాయడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.

అందుకోసం ముందుగా ఒక కాకరకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇలా క‌ట్ చేసుకున్న‌ ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఒక స్ప్రే బాటిల్ లో కాకరకాయ జ్యూస్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Bitter Gourd, Bittergourd, Fungal, Care, Care Tips, Fall, Healthy-Telugu

కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌, విటమిన్ సి మరియు ఫోలిక్స్ ఆమ్లం జుట్టు కుదుళ్ల‌ను బ‌ల‌ప‌రిచి.జుట్టు రాల‌డాన్ని( Hairfall ) నిరోధిస్తాయి.కాకరకాయకు రక్త ప్రసరణను మెరుగుపరచే గుణాలు ఉన్నాయి.

కాక‌ర‌కాయ ర‌సాన్ని త‌ల‌కు రాయ‌డం వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్ మెరుగుప‌డి హెయిర్ గ్రోత్( Hair Growth ) ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ద‌ట్టంగా పెరుగుతుంది.

Telugu Bitter Gourd, Bittergourd, Fungal, Care, Care Tips, Fall, Healthy-Telugu

అలాగే చుండ్రు( Dandruff ) స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న‌వారికి కాక‌ర‌కాయ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.వారానికి ఒక‌సారి కాక‌ర‌కాయ ర‌సాన్ని త‌ల‌కు ప‌ట్టిస్తే.అందులోని యాంటీ ఫంగల్ గుణాలు త‌ల చ‌ర్మంపే ఉండే ఫంగల్ సంక్రమణలను నివారించి, డ్యాండ్రఫ్‌ను తగ్గిస్తాయి.అంతేకాకుండా కాక‌ర‌కాయ ర‌సాన్ని హెయిర్ కు రాయ‌డం వ‌ల్ల జుట్టు చిట్ల‌డం, విర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

కురుల‌కు చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.జుట్టు షైనీగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube