మన శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో జుట్టుకు కూడా అంతే అవసరం.కురుల ఆరోగ్యానికి ప్రోటీన్ అండగా ఉంటుంది.
జుట్టు రాలడాన్ని(Hair loss) సమర్థవంతంగా నివారిస్తుంది.అందుకే అప్పుడప్పుడు ప్రోటీన్ హెయిర్ మాస్కులను వేసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా నెలకు రెండు సార్లు ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ మాస్క్ ను కనుక వేసుకుంటే మీ జుట్టు రాలమన్న రాలదు.అదే సమయంలో మరిన్ని బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ప్రోటీన్ మాస్క్(Protein mask) తయారీ కోసం.ముందుగా ఒక కలబంద (Aloe vera)ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక ఫుల్ ఎగ్ (EGG)ను బ్రేక్ చేసి వేసుకోవాలి.
వీటితో పాటుగా రెండు గింజ తొలగించి సన్నగా తరిగిన ఉసిరికాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు(Curd), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె(Coconut Oil) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం గాఢత తక్కువగా ఉన్న షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
నెలకు రెండు సార్లు ఈ ప్రోటీన్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రోంగ్ గా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా దూరం అవుతుంది.అలాగే ఈ ప్రోటీన్ మాస్క్ జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.జుట్టు విరగడాన్ని, చిట్లడాన్ని నివారిస్తుంది.కురులకు చక్కని మెరుపును జోడిస్తుంది.మరియు జుట్టు ఎదుగుదలను సైతం ప్రోత్సహిస్తుంది.
కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పుకున్న ప్రోటీన్ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.