వేసవికాలం( Summer ) ఇంకా ప్రారంభం కాకముందే ఎండలు భారీగా పెరిగిపోయాయి.భానుడు ఇప్పటి నుంచే తన ప్రతాపం చూపుతున్నాడు.
ఇక ఈ ఎండల్లో గంట తిరిగామంటే స్కిన్ అనేది డార్క్ గా డల్ గా( Dull SKin ) మారిపోతుంటుంది.అయితే అటువంటి చర్మాన్ని రిపేర్ చేయడానికి అద్భుతమైన హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ ఓట్స్( Oats ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రాండ్ చేసుకున్న రైస్ అండ్ ఓట్స్ పౌడర్ లో వన్ టీ స్పూన్ మిల్క్ పౌడర్,( Milk Powder ) వన్ టీ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా పచ్చి పాలు లేదా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు మరియు చేతలకు అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ హోమ్ రెమెడీ చర్మంపై మురికిని, మృతకణాలను తొలగిస్తుంది.ఎండల వల్ల టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేస్తుంది.స్కిన్ మళ్ళీ అందంగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
అలాగే ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం పై మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.
అంతే కాదండోయ్.ఈ సింపుల్ రెమెడీ చర్మానికి మంచి తేమను అందించి, డ్రై స్కిన్ సమస్య నుంచి విముక్తిని కలిగిస్తుంది.
చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.కాబట్టి, ఎండల దెబ్బకు చర్మం డార్క్ గా, డాల్ గా మారిందని బాధపడుతున్న వారు తప్పుకున్న ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.