టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు డార్లింగ్ ప్రభాస్.ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు.
కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్.

కాగా ప్రభాస్ ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు.కల్కి 2, రాజాసాబ్, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, సలార్ 2వంటి సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.వీటిలో రాజా సాబ్( Rajasaab ) సినిమా విడుదల కానుంది.కాగా ప్రస్తుతం ఇండియన్ సినిమాస్ లో మోస్ట్ బిజీగా ఉన్న టాప్ హీరోస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు.
మరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా వీటిలో ప్రతి సినిమాలో కూడా కొత్త లుక్ లో ప్రభాస్ కనిపించనున్నారు.అయితే ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కలయికలో చేస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లుక్ వైరల్ గా మారింది.

అయితే ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.అలాగే అభిమానులు కూడా ప్రభాస్ లుక్స్ పట్ల డిజప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది.ఇది వరకు సూపర్ స్మార్ట్ గా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు కొంచెం బొద్దుగా కనిపించడంతో ఇవి వైరల్ గా మారాయి.మరి మళ్లీ ప్రభాస్ స్మార్ట్ లుక్ లో ఎపుడు కనిపిస్తాడో చూడాలి మరి.అయితే ప్రభాస్ ఒకవేళ బొద్దుగా కనిపిస్తే మాత్రం అభిమానులకు నిరాశ తప్పదు అని చెప్పాలి.ఈ విషయం పట్ల అభిమానులు కొంచెం టెన్షన్ లో ఉన్నారు.
ఈ విషయంపై హను రాఘవపూడి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.