నోటి దుర్వాసన. చాలా మంది వేధించే కామన్స్ సమస్యల్లో ఇది ఒకటి.
ఇది చిన్న సమస్యే అయినప్పటికీ.చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది.
పిల్లల్లోనే కాదు.పెద్దల్లోనూ ఈ సమస్య ఉంటుంది.
నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొనే వారు.ఇతరులతో ఫ్రీగా మాట్లాడేందుకు తెగ ఇబ్బంది పడుతుంటారు.
ఈ క్రమంలోనే నోటి దుర్వాసనను పోగొట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకున్నా.
మౌత్ వాష్‌లు వాడినా కొందరిలో ఎలాంటి ఫలితం ఉండదు.ఇలాంటి వారు.
నోటి దుర్వాసనను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఎందుకంటే, నోటి దుర్వాసన అనేది పలు వ్యాధులకు సంకేతం అవ్వొచ్చు.
ముఖ్యంగా కిడ్నీ (మూత్ర పిండాలు) వ్యాధులు ఉన్న వారికి నోటి దుర్వాసన ఒక సంకేతంగా చెప్పొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మూత్ర పిండాలు డ్యామేజ్ అయినప్పుడు లేదా మూత్ర పిండాల వ్యాధులు ఉన్నప్పుడు రక్త ప్రవాహంలో యూరియా పెరుగుతుంది.
తద్వారా నోటి దుర్వాసనకు దారి తీస్తుంది.కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నోటి దుర్వాసన పోకుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
అలాగే మధుమేహానికి సంకేతంగా కూడా నోటి దుర్వాసనను చెప్పుకోవచ్చు.ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మధుమేహం సమస్యతో బాధ పడుతున్నారు.అయితే మధుమేహాన్ని మొదటి దశలో ఉండగానే గుర్తిస్తే.శాశ్వతంగా నివారించుకోవచ్చు.అయితే మధుమేహం యొక్క ప్రారంభ సంకేతాలను నోటి వాసన ద్వారా గుర్తించవచ్చు.అందువల్ల, నోట్లో తరచుగా స్మెల్ వస్తుంటే మాత్రం షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఉత్తమం.
అదేవిధంగా, శరీరంలో తగినంత నీరు సరిపోకపోతే డీ హైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది.ఇదే సమయంలో నోటి దుర్వాసనకు కూడా దారి తీస్తుంది.నీరు సరిగ్గా తీసుకోకుండా ఉంటే.నోరు పొడిబారిపోతుంది.ఫలితంగా నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది.కాబట్టి, నోటి నుంచి తరచూ దుర్వాసన వస్తే.
శరీరానికి తగినంత నీరు అందడం లేదని కూడా చెప్పుకోవచ్చు.