డిష్యుం డిష్యుం.. ఇప్పటి వరకు టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇవే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఊహించని ఆదరణ లభించింది అని చెప్పాలి.

ఎప్పుడు కమర్షియల్ సినిమాలు చేసే స్టార్ హీరోలు కొన్నిసార్లు స్పోర్ట్స్ నేపథ్యంలో జరిగే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అని చెప్పాలి.

క్రీడాకారుల జీవితాల్ని ఆధారంగా తీసుకుని సినిమాలు తీస్తే మరికొంతమంది సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.ఇలా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కి ఇప్పటి వరకు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

తమ్ముడు :

పవన్ కళ్యాణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన తమ్ముడు సినిమా ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.1996లో విడుదలైన ఈ సినిమా ఇక యూత్ లో పవన్ కి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలోని భావోద్వేగాలు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి :

మాస్ మహారాజా రవితేజ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.2003 ఏప్రిల్ 19వ తేదీన విడుదలై సూపర్ హిట్ అయిన ఈ సినిమా పలు భాషల్లోకి కూడా రీమేక్ అయ్యింది.

జానీ :

పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది.ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు.2003 ఏప్రిల్ 25 వ తేదీన విడుదలైనా సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

జై :

విభిన్నమైన దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా జై బాక్సింగ్ దేశభక్తి నేపథ్యంలో వచ్చింది.ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

Advertisement

గురు :

విక్టరీ వెంకటేష్ హీరోగా సుధ కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితికా సింగ్ కు బాక్సింగ్ నేర్పించే కోచ్ గా వెంకటేష్ నటించాడు.2017 స్పోర్ట్స్ డ్రామా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

సార్పట్టా :

రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పిరియాడికల్ డ్రామా సార్పాట.ఆర్య హీరోగా నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా మంచి విజయం సాధించింది.

గని :

మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ గనీ.ఈ రోజే థియేటర్లలో విడుదలైంది.ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించాడు వరుణ్.

ఇక ఈ సినిమా ఎంత మంచి విజయం సాధిస్తుందో చూడాలి.

లైగర్ :

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా పాన్ ఇండియా స్పోర్ట్స్ ఫిలిం గా తెరకెక్కుతోంది లైగర్.మార్షల్ ఆర్ట్స్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.2022 ఆగస్టు 25వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు