ఈ గ్రీన్ జ్యూస్ తో రక్తహీనత నుంచి అధిక బరువు వరకు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు!

రక్తహీనత( Anemia ) తోబాధపడుతున్నారా.? బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.? తరచూ అలసట నీరసం వేధిస్తున్నాయా.? రక్తపోటు అదుపు తప్పుతుందా.? డోంట్ వర్రీ ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే ఆయా సమస్యలన్నిటికీ సులభంగా చెక్ పెట్టవచ్చు.మరి ఆ గ్రీన్ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు అది అందించే ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Anemia, Cucumberspinach, Green, Tips, Latest-Telugu Health

ముందుగా చిన్న కీర దోసకాయ( Cucumber )ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న‌ ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఐదు ఫ్రెష్ పాలకూర ఆకులను తీసుకుని వాటర్ తో కడిగి కట్ చేసుకుని పెట్టాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో అర కప్పు సీడ్ లెస్ గ్రేప్స్ వేసుకోవాలి.

అలాగే కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, పాలకూర( Spinach ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అంతే మన గ్రీన్ జ్యూస్ సిద్ధం అయినట్టే.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి తీసుకోవాలి.

వారంలో కనీసం నాలుగు సార్లు ఈ గ్రీన్ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్( Iron ) లభిస్తుంది.

హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.దీంతో రక్తహీనత పరార్ అవుతుంది.

అలాగే ఈ గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.పొట్ట కొవ్వు కరుగుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.మధుమేహం, గుండె జ‌బ్బులు, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఒకవేళ మధుమేహం ఉంటే కనుక బ్లడ్ షుగర్ లెవల్స్( Blood Sugar Levels ) కంట్రోల్ తప్పకుండా ఉంటాయి.

Telugu Anemia, Cucumberspinach, Green, Tips, Latest-Telugu Health

అంతేకాదండోయ్‌.ఈ గ్రీన్ జ్యూస్( Green Juice ) ను తీసుకోవ‌డం వ‌ల్ల నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. బాడీ డిటాక్స్( Body Detox ) అవుతుంది.

చర్మం నిగారింపుగా యవ్వనంగా మెరుస్తుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.

మరియు కంటి చూపు సైతం రెట్టింపు అవుతుంది.కాబట్టి హెల్తీ గా ఫిట్ గా మరియు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండాలి అని కోరుకునే వారు తప్పకుండా ఈ గ్రీన్ జ్యూస్ ను డైట్ లో చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube