కాకరకాయ రసం జుట్టుకు రాస్తే ఎన్ని లాభాలో తెలుసా?
TeluguStop.com
కాకరకాయ.( Bitter Gourd ) ఈ పేరు వెంటనే చాలా మంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంటారు.
కారణం దాని రుచి.కాకరకాయ చేదుగా ఉండడం వల్ల ఎక్కువ శాతం మంది దాన్ని తినేందుకు ఇష్టపడరు.
కానీ ఆరోగ్యపరంగా కాకరకాయ అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.అలాగే జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా తోడ్పడుతుంది.
కాకరకాయ రసాన్ని( Bitter Gourd Juice ) జుట్టుకు రాయడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.
అందుకోసం ముందుగా ఒక కాకరకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.
ఒక స్ప్రే బాటిల్ లో కాకరకాయ జ్యూస్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. """/" /
కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, విటమిన్ సి మరియు ఫోలిక్స్ ఆమ్లం జుట్టు కుదుళ్లను బలపరిచి.
జుట్టు రాలడాన్ని( Hairfall ) నిరోధిస్తాయి.కాకరకాయకు రక్త ప్రసరణను మెరుగుపరచే గుణాలు ఉన్నాయి.