ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.కొంతమంది పెంపుడు జంతువు లాగా కుక్కలను, పిల్లులను ఇంకా మరికొన్ని రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటే.
మరికొందరు ఇతర దేశాలలో పాములు, కొండచిలువలను( Snakes , pythons ) పెంచుకుంటూ ఉంటారు.ఇక పెంపుడు జంతువులు అంటే చాలా మంది ఎక్కువగా కుక్కను పెంచుకోవడానికి మొగ్గు చూపుతారు.
ఇంకా వాటి కోసం యజమానులు ఆ పెంపుడు కుక్క కోసం ప్రత్యేకమైన దుస్తులు, వాటికి ప్రత్యేకమైన ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉండడం మనం మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం.
అయితే తాజాగా ముంబైకి ( Mumbai )చెందిన ఒక మహిళ మాత్రం తన పెంపుడు కుక్క కోసం ఏకంగా ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే.ముంబై నగరంలోని చెంబూర్ ( Chembur )ప్రాంతానికి చెందిన సల్దాన్హా ( Saldanha )అనే ఒక మహిళ తాజాగా తన పెంపుడు కుక్క బర్త్ ద్య సెలబ్రేషన్స్ లో భాగంగా ఏకంగా 2.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసును గిఫ్ట్ గా ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ బంగారు గొలుసును ఆ మహిళ అనిల్ జువెలర్స్ ( Anil Jewellers )అనే ఫేమస్ జువెలరీ షాపులో కొనుగోలు చేసి తన పెంపుడు టైగర్ ( కుక్క పేరు) కు గిఫ్ట్ గా ఇచ్చింది.ఆ నగల దుకాణంలోనే బంగారు గొలుసును శునకం మెడలో వేయగా ఒక్కసారిగా ఆ కుక్క కూడా ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టింది.ఈ వీడియోను అనిల్ జ్యువెలర్స్ యజమాని పీయూష్ జైన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇక వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు.” ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుందంటే ఏమో అనుకున్న .అది ఇదేనేమో ” అని ఫన్నీ గా కామెంట్ చేసారు.