కార్యకర్తలకు వందనం .. జగన్ ను నమ్ముతారా ? 

ఓటమి భారం నుంచి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్( jagan ) కోరుకుంటున్నారు.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు గెలుపొందడాన్ని ఇప్పటికీ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఈ తప్పిదాల కారణంగా పార్టీకి ఈ స్థాయిలో ఓటమి ఎదురైంది అనేది జగన్ గుర్తించారు.వైసిపి( ycp ) అధికారంలో ఉండగా పార్టీ క్యాడర్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా,  వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని జగన్ నడిపించారు. 

 Salute To Activists Do You Believe Jagan, Jagan, Ysrcp, Ap Government, Tdp, Jana-TeluguStop.com
Telugu Ap, Jagan, Janasena, Salute Jagan, Ysrcp-Politics

వారి సహకారంతోనే మళ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని, వారి ద్వారానే ప్రజలకు వైసీపీ మరింత చేరు అవుతుందని జగన్ వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి.కీలకమైన పోలింగ్ సమయంలో వాలంటీర్లు ( Volunteers )కలిసి రాలేదు.ఐదేళ్లపాటు తమను పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇవ్వడం , జనాల్లో తమకు అంతగా ప్రాధాన్య దక్కకుండా చేయడం , పార్టీ కోసం కష్టపడి పనిచేసినా,  తమకు మిగిలింది శూన్యం అనే అభిప్రాయానికి వచ్చిన కేడర్ కూడా 2024 ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం పెద్దగా కష్టపడేందుకు ఇష్టపడలేదు. 

Telugu Ap, Jagan, Janasena, Salute Jagan, Ysrcp-Politics

ఫలితంగానే వైసిపి ఇంతటి ఘోర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.అయితే ఇప్పుడు ఆ కార్యకర్తల ప్రాధాన్యం ఏమిటో జగన్ కు తెలిసి వచ్చింది.వారి సహకారం లేకపోతే ఎన్నికల్లో విజయం అసాధ్యమనే విషయాన్ని గుర్తించిన జగన్ వారికి దగ్గరయ్యేందుకు సరికొత్త వ్యూహంతో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు కార్యకర్తల సంక్షేమం కోసం అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు.ముందుగా కార్యకర్తలకు బీమా పథకాన్ని ( Insurance scheme for workers )అమలు చేయాలని భావిస్తున్నారు.

  ఏదైనా ప్రమాదంలో గాయపడిన లేక, మరణించిన వైసీపీ కార్యకర్తల కుటుంబానికి ఆ భీమాను అందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.అలాగే పార్టీలో ప్రత్యేక ఆర్థిక నిధిని ఏర్పాటు చేసి దానిని కార్యకర్తల సంక్షేమం కోసం వినియోగించాలని జగన్ భావిస్తున్నారు.

కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నిధిని వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు.  ఇంకా పార్టీ కార్యకర్తలకు అనేక ప్రయోజనాలు చేకూర్చి వారిలో నమ్మకాన్ని పెంచుకునేందుకు ఈ ఐదేళ్లపాటు వారి సహకారంతోనే టిడిపి కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు జగన్ సిద్ధం అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube