ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్( Netflix ) తాజాగా ఆదాయాన్ని పెంచే ప్రయత్నాన్ని మొదలు పెట్టేసింది.ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా థియేటర్లోకి వెళ్లి సినిమాలో చూడాలని ఎక్కువగా ఇష్టపడటం లేదు.
ఇంట్లోనే ఉంటూ ఓటిటి( OTT ) ద్వారా విడుదల ఆయన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.ఇది ఇలా ఉండగా.
తాజాగా నెట్‌ఫ్లిక్స్ మాత్రం నెలవారి ఫీజులను పెంచేసింది.ఎటువంటి ప్రకటనలు లేకుండా.
నెట్ఫెక్ట్స్ ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఉపయోగించాలంటే అదనపుగా చార్జీలు చెల్లించాలి అంటూ వినియోగదారుల కోసం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.మీ ప్రస్తుత ప్లాన్ కి చివరి తేదీ జూలై 13 అని.మీరు చూడాలంటే కొత్త ప్లాన్ ఎంచుకోండి అంటూ నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.

ఇక నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం.580 రూపాయలు చెల్లిస్తే ప్రకటనలతో చూడడానికి, ప్రకటన లేకుండా చూడాలనుకుంటే 1300 మీరు చెల్లించాలి.అలాగే 4k క్వాలిటీతో చూడాలంటే 2000 రూపాయలు చెల్లించాలంటూ తెలిపింది.
గతంలోనే ఈ ఏడాది ద్వితీయార్థంలో ధరలను పెంచనునట్లు కూడా తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక మరో వైపు నెట్‌ఫ్లిక్స్ తన సబ్స్క్రిప్షన్( Netflix Subscription ) ఆఫర్లను బలోపితం చేయడానికి, వినియోగదారులను ప్రకటనదారుల వైపు నెట్టడానికి ఇలాంటి ప్లాన్లు తీసుకొని వస్తున్నట్లు సమాచారం.

అయితే గత ఏడాది నెట్‌ఫ్లిక్స్ యూఎస్, కెనడా, యూకేలో కొత్త సభ్యుల కోసం ప్రాథమిక ప్రణాళికను నిలిపివేసింది.అయితే ఇప్పటికే యుఎస్‌లో ఉన్న సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రాథమిక ప్లాన్‌ను ఎప్పటి నుంచి తొలగించడం ప్రారంభిస్తుందో నెట్‌ఫ్లిక్స్ ఇంకా ప్రకటన ఇవ్వలేదు.ఇక మన భారతదేశంలో ప్లాట్‌ఫారమ్ నాలుగు ప్లాన్ లను అందిస్తుంది.నెలకు మొబైల్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం లాంటికి రూ.199 ధర కలిగిన బేసిక్ ప్లాన్, మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, స్మార్ట్ టీవీలలో 720p రిజల్యూషన్‌లో స్ట్రీమింగ్ కు అవకాశం ఇచ్చింది.







