ఈ ఇంటి చిట్కాలు ఉండగా నల్లటి వలయాలతో దిగులెందుకు దండగ!

అధిక ఒత్తిడి, స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం, కంటి నిండా నిద్ర లేకపోవడం, పోషకాల కొరత తదితర కారణాల వల్ల మనలో చాలా మందికి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.వీటినే డార్క్ సర్కిల్స్( Dark circles ) అని కూడా అంటాము.

 Follow These Home Remedies To Get Rid Of Dark Circles! Dark Circles, Home Remedi-TeluguStop.com

నల్లటి వలయాలు చాలా అసహ్యంగా కనిపిస్తాయి.ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి.

ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ కారణంగా ఎంతగానో దిగులు చెందుతూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే దిగులే అక్కర్లేదు.

ఈ చిట్కాలతో నల్లటి వలయాలను తరిమి తరిమి కొట్టవచ్చు.

టిప్ 1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్,( almond oil ) హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.రోజు నైట్ ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా నల్లటి వలయాలు మాయం అవుతాయి.

Telugu Tips, Dark Circles, Riddark, Latest, Skin Care, Skin Care Tips-Telugu Hea

టిప్ 2: టమాటో తో కూడా మనం డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ లో నాలుగు టేబుల్ స్పూన్లు టమాటో జ్యూస్( Tomato juice ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ ఇంటి చిట్కాను పాటించిన కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Tips, Dark Circles, Riddark, Latest, Skin Care, Skin Care Tips-Telugu Hea

టిప్ 3: ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కొబ్బరి పాలు( Fresh coconut milk ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు కీరా దోసకాయ జ్యూస్( Keera Cucumber Juice ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో రెండు కాటన్ ప్యాడ్స్ ను ముంచి కళ్ళపై పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలి.20 నిమిషాల తర్వాత వాటిని తొలగించి కళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube