తలనొప్పిని తరిమికొట్టే గసగసాలు.‌. ఇంతకీ ఎలా వాడాలో తెలుసా..?

దాదాపు అందరూ సర్వ సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో తలనొప్పి ఒకటి.తల నొప్పికి ( headache )ప్రధాన కారణం ఒత్తిడి.

 Poppy Seeds Helps To Get Rid Of Headache Quickly! Poppy Seeds, Poppy Seeds Benef-TeluguStop.com

నేటి ఆధునిక కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడితో సహవాసం చేస్తున్నారు.ఒత్తిడి వల్ల ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటుంది.

తలనొప్పి కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది.

మైండ్ అస్సలు పనిచేయదు.అయితే అలాంటి సమయంలో ఎక్కువ శాతం మంది నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం కోసం పెయిన్ కిల్ల‌ర్స్ వైపు మొగ్గు చూపుతారు.

కానీ స‌హ‌జంగా కూడా త‌ల‌నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

తలనొప్పిని నివారించడంలో గసగసాలు( poppy seeds ) చాలా బాగా సహాయపడతాయి.

చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్న‌ప్ప‌టికీ గసగసాల్లో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.ఆరోగ్యపరంగా గసగసాలు అపారమైన ప్రయోజనాల‌ను చేకూరుస్తాయి.

తల నొప్పిని తగ్గించడానికి కూడా తోడ్పడతాయి.అందుకోసం గసగసాలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Headache, Headache Tips, Tips, Latest, Poppyseeds-Telugu Health

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకోవాలి.అలాగే నాలుగు యాలకులు( Cardamom ), ఒక దంచిన కరక్కాయ( Karakkaya ) వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నిప్పుకుని స్టోర్ చేసుకోవాలి.తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ పొడి సహాయపడుతుంది.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు పాలు పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ గసగసాల పొడిని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Headache, Headache Tips, Tips, Latest, Poppyseeds-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో పాలును ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.ఈ విధంగా కనుక చేశారంటే తలనొప్పి నుంచి చాలా వేగంగా ఉపశమనం పొందుతారు.ఈ గసగసాల మిల్క్ ఒక పెయిన్ కిల్లర్ మాదిరి పని చేస్తుంది.తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ మిల్క్ ను తీసుకుంటే నిమిషాల్లో రిలీఫ్ ల‌భిస్తుంది.అలాగే ఈ మిల్క్ ఒత్తిడి, ఆందోళన వంటి ఇత‌ర మాన‌సిక సమస్యలను సైతం చిత్తు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube