జగన్ ఓడిపోవడంతో హ్యాపీగా ఉన్నాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నాగ్ అశ్విన్ ( Nag Aswin ) చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ ఈయన మాత్రం పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.ఇటీవల కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయాన్ని అందుకున్నారు.

 Director Nag Aswin Sensational Comments On Ap Ex Cm Ys Jagan , Nag Aswin, Kalki-TeluguStop.com

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడారు రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ ఏపీ ప్రభుత్వం గురించి ప్రశ్నలు వేశారు.

Telugu Nagaswin, Kalki, Nag Aswin, Ticket Cost, Ys Jagan-Movie

గతంలో జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు కూడా సినిమాని చూసే ఆనందించాలన్న ఉద్దేశంతో సినిమా టికెట్ల రేటు తగ్గించారు.తద్వారా నిర్మాతలు అందరూ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.కానీ ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సినిమా టికెట్ల రేట్ల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో ఈ విషయం గురించి నాగ్ అశ్విన్ కి ప్రశ్న ఎదురయింది.

ఒకవేళ ఏపీలో జగన్ తిరిగి విజయం సాధించి ఉంటే .అప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగేవి కాదు కదా.అప్పుడు మీ పరిస్థితి ఏంటనే ప్రశ్న నాగ్ అశ్విన్‌కు ఎదురైంది.

Telugu Nagaswin, Kalki, Nag Aswin, Ticket Cost, Ys Jagan-Movie

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ అలా జరగలేదు కాబట్టే ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నామంటూ ఒక్క మాటలో సమాధానం చెప్పేశారు.జగన్ ఓడిపోవడంతోనే మేము హ్యాపీగా ఉన్నామని ఈయన చెప్పకనే చెప్పేశారు.అయితే జగన్ ఓటమి గురించి చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి అధికారంలోకి రావడంతో సినీ సెలెబ్రెటీలందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఇకపోతే నాగ్ అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈయన అశ్వినీ దత్ అల్లుడు అనే సంగతి మనకు తెలిసిందే.ఇక అశ్విని దత్ ఎన్నికలలో టిడిపి గెలవాలని బలంగా కోరుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube