చూపులకు ఎంతో అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించే గులాబీ పూలు అలంకరణకే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కూడా ఉపయోగిస్తుంటారు.అలాగే గులాబీ పూలు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా బాన పొట్టను తరిమి కొట్టడంలో గులాబీ పూలు గ్రేట్ గా సహాయపడతాయి.అవును, గులాబీ పూలతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం గులాబీ పూలతో పొట్ట కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందు ఒకటి లేదా రెండు గులాబీ పూలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి రేకులను తుంచుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గులాబీ రేకులు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ డ్రింక్ ను సేవించాలి.ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు.రోజుకు ఒక కప్పు చొప్పున ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకు పోయిన కొవ్వు మొత్తం క్రమంగా కారుతుంది.దాంతో బాన పొట్ట కాస్త ఫ్లాట్ గా మారుతుంది.
అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
మరియు జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం చురుగ్గా సాగుతుంది.