యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కార్తికేయ 2 తర్వాత ఈయన పేరు దేశం అంతటా మారుమోగి పోయింది.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ 2 కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.ఈ సినిమా పార్ట్ 1 కంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను సైతం మెప్పించి అక్కడ కూడా బాగా వసూళ్లు రాబట్టింది.
దీంతో నిఖిల్ కు పాన్ ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది.
ఇక కార్తికేయ 2 సినిమా హిట్ వల్ల నిఖిల్ నెక్స్ట్ చేస్తున్న సినిమాలపై కూడా మంచి క్రేజ్ ఏర్పడడంతో బాగా బిజినెస్ జరుగుతుంది.ప్రెజెంట్ నిఖిల్ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.
అందులో 18 పేజెస్ ఒకటి.కార్తికేయ 2 జోడీనే ఈ సినిమాలో కూడా కనిపించ బోతున్నారు.
కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు.సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కథ అందించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
అసలైతే ఈ సినిమా కార్తికేయ కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.దీంతో ఈ సినిమాకు ఇప్పుడు కలిసి వస్తుంది అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా నుండి ”నన్నయ రాసిన” అనే లైన్ తో రాబోతున్న ఈ పాటను నవంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా కూడా నిఖిల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో లేదో చూడాలి.







