వైరల్ వీడియో: ధోని ఫాన్స్ ఇక్కడ.. 100 అడుగుల కట్ అవుట్ సెలబ్రేషన్స్ మాములుగా ఉండదు...

భారతదేశంలోని చాలా మంది క్రికెట్ అభిమానులకు జులై 7న ఒక పెద్ద పండగానే చెప్పాలి.ఎందుకంటే.

 Viral Video: Dhoni Fans Here.. 100 Feet Cut Out Celebrations Are Not Normal ,-TeluguStop.com

,జులై 7 న భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టినరోజు( MS Dhoni birthday ).ఈ రోజున ఎంఎస్ ధోని అభిమానులందరూ కూడా ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు.ఇక ఈ క్రమంలో నేడు కూడా ధోని బర్త్ డే వేడుకలను చాలా గ్రాండ్ గా జరుగుతూన్నాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్క క్రికెట్ అభిమానూలతోపాటు అన్ని రంగాల ప్రముఖులు ఎంఎస్ ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.

ఇకపోతే తెలుగు అభిమానులు మాత్రం వారి అభిమానాన్ని ప్రత్యేకంగా వేరే లెవెల్ లో చాటుకున్నారు.అసలు విషయానికి వెళ్తే.ఆంధ్రప్రదేశ్లోని నందిగామ( Nandigama )లో ఎంఎస్ ధోని 100 అడుగుల ఎత్తయిన కటౌట్ ను సిద్ధం చేసి క్రాకర్స్ కాల్చి మరి సెలబ్రేషన్స్ చేసుకుంటూన్నారు.ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధోని నాయకత్వంలో టీమిండియా 2007లో టి20 వరల్డ్ కప్ ఐసీసీ ట్రోఫీని సొంతం చేరుకుంది.అనంతరం భారత్ కు వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని అందించాడు.

అలాగే ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్‌లో టీమ్ ఇండియా( Team India )కు కెప్టెన్‌గా 60 మ్యాచ్‌లు ఆడగా అందులో ఇండియాన్ టీం 27 మ్యాచ్ లు విజయం సాధించింది.ఇది కాకుండా వన్డేల్లో టీమిండియాకు 200 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా కూడా ఉన్నారు.టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోని 72 మ్యాచ్‌లు చేసారు.అంతేకాదు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించి 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక 2020లో ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే.ధోని తన అంతర్జాతీయ కెరీర్‌ లో 2004 – 2019 వరకు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.టెస్టులో 144 ఇన్నింగ్స్‌ల్లో 38.09 సగటుతో 4876 పరుగులు తీసాడు.ఐకమరోవైపు వన్డేల్లో 50.57 సగటుతో 10773 పరుగులు జోడించాడు.కాగా., టీ20 ఇంటర్నేషనల్‌లో ధోనీ 37.60 సగటుతో 1617 పరుగులు, స్ట్రైక్ రేట్ 123 చేశాడు.ఇప్పటి వరకు మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్ చేయలేకపోయాడు అంటే నమ్మండి.అందుకే మహేంద్రసింగ్ ధోని కి అంతమంది అభిమానులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube