బింబిసార 2 విషయం లో కళ్యాణ్ రామ్ రిస్క్ చేయడానికి కారణం ఏంటి..?

నందమూరి కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ప్రస్తుతం రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.ఇక అతని పుట్టినరోజు సందర్భంగా బింబిసార 2 సినిమాను( Bimbisara 2 movie ) కూడా అనౌన్స్ చేశాడు.

 What Is The Reason For Kalyan Ram To Take Risk In Bimbisara 2 , Bimbisara 2, Kal-TeluguStop.com

అయితే ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అయిన అనిల్( Anil ) దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే మొదటి పార్ట్ ని వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మాత్రం వశిష్ట అందుబాటులో లేకపోవడంతో అనిల్ ను పెట్టి ఈ సినిమాను తీస్తున్నాడు.

మరి ఈ సినిమాకి డైరెక్టర్ అయిన అనిల్ కి పెద్దగా అనుభవమైతే లేదు.భారీ బడ్జెట్ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ ఇలాంటి ఒక మంచి సమయంలో రిస్క్ చేయడం అవసరమా ఇంకా వేరే ఏదైనా డైరెక్టర్ ని తీసుకుంటే బాగుండేది కదా అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా కళ్యాణ్ రామ్ తను అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

 What Is The Reason For Kalyan Ram To Take Risk In Bimbisara 2 , Bimbisara 2, Kal-TeluguStop.com

ఎందుకంటే ఒకసారి కనక తను ఈ సినిమాల ద్వారా మంచి సక్సెస్ లను అందుకున్నట్లయితే ఆయన తన కెరియర్లో మరోసారి ముందుకు దూసుకెళ్తాడు.లేదంటే మాత్రం మరోసారి చతికిలబడిపోతాడు.

మరి ఇలాంటి సమయంలో రిస్క్ ఎందుకు చేస్తున్నాడు అంటే మరి కొంతమంది చెప్పే విషయాలను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ వల్లే తను ఇలాంటి రిస్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎన్టీఆర్ వెనుక నుండి బింబిసార 2 సినిమా చేయమని సపోర్ట్ చేస్తున్నాడట.దానివల్ల ఈ సినిమాని చేస్తూ భారీ బడ్జెట్ సైతం పెట్టడానికి సిద్ధమయ్యాడు… చూడాలి మరి మొదటి పార్ట్ లాగే ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ను అందుకుంటుందా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube