యూకే : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం.. ఉనికి కోసం కన్జర్వేటివ్‌లు పోరాడాల్సిందేనా..?

జూలై 4న జరిగిన యూకే సార్వత్రిక ఎన్నికల్లో( UK general election ) 14 ఏళ్ల పాటు సాగిన కన్జర్వేటివ్‌ల పాలనకు తెరపడి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్( Keir Starmer ) బాధ్యతలు స్వీకరించారు.

 After Crushing Defeat, Fight Begins For Soul Of Uk Conservative Party , Uk Cons-TeluguStop.com

ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ కూర్పును సైతం ఆయన పూర్తి చేశారు.ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదేనని మాజీ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు.

Telugu Keir, Rishi Sunak, Uk Conservative, Uk General-Telugu NRI

అయితే గతంలో ప్రధానులుగా ఉన్న వారి నిర్ణయాల వల్లే టోరీలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రధానంగా పన్నులు, వలసలు, ఆర్ధిక వ్యవస్ధ మందగమనం, జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం పార్టీని ముంచాయని నేతలు చెబుతున్నారు.పార్టీని గట్టెక్కించేందుకు రిషి సునాక్ ( Rishi Sunak )దిద్దుబాటు చర్యలు తీసుకున్నా అవేవి గట్టెంక్కించలేకపోయాయి.అయితే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో కన్జర్వేటివ్‌లు పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు.

పార్టీకి సాంప్రదాయకంగా ఓటు బ్యాంక్‌గా ఉన్న వర్గాలను విస్మరిస్తే అంతరించిపోవడం ఖాయమని కొందరు హెచ్చరిస్తున్నారు.పార్టీ అధినాయకత్వ పదవికి రిషి సునాక్ రాజీనామా చేయడంతో కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాల్సి ఉంది.

అన్నింటికి మించి బ్రెగ్జిట్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిగెల్ ఫరేజ్ నేతృత్వంలోని వలస వ్యతిరేక రిఫార్మ్ యూకే పార్టీ … కన్జర్వేటివ్‌లను ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బకొట్టింది.రైట్ వంగ్ ఓట్‌లను చీల్చడం ద్వారా కీలక నియోజకవర్గాలలో మాజీ టోరీ మద్ధతుదారులను ఆయన అభ్యర్ధులుగా ఎంపిక చేసి షాకిచ్చారు.

Telugu Keir, Rishi Sunak, Uk Conservative, Uk General-Telugu NRI

మాజీ అంతర్గత శాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ ( Suella Braverman )మాట్లాడుతూ.ఇమ్మిగ్రేషన్, పన్నులు తగ్గించడంలో తాము విఫలమయ్యామని పేర్కొన్నారు.14 ఏళ్లుగా తాము పాటించిన పొదుపు చర్యలు ఏమాత్రం ఫలితాలను ఇవ్వలేదన్నారు.ఓటమి తర్వాత నిజాయితీగా ఫలితాలను విశ్లేషించాలని.

మా పార్టీ ఉనికిలో కొనసాగుతుందో లేదో అదే నిర్ణయిస్తుందని సుయెల్లా పేర్కొన్నారు.మరోవైపు .ఓటమి నేపథ్యంలో నేతల మధ్య అంతర్గత పోరు జరుగుతుందనే భయంతో తదుపరి పార్టీ నాయకుడిని ఎన్నుకునే వరకు లీడర్‌గా తానే కొనసాగుతానని రిషి సునాక్ స్పష్టం చేశారు.ఎన్నికల్లో కన్జర్వేటివ్‌లు 121 స్థానాలకే పరిమితం కాగా.

విపక్షంతో పోల్చితే లేబర్ పార్టీ దాదాపు 170 సీట్లకు పైగా అంతరం ఉండటంతో ఒక తరం పాటు లేబర్ నేతలు అధికారంలో ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube