ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?

హలో బ్రదర్( Hello Brother )” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఇంద్రజ ఆ తర్వాత యమలీల సినిమా( Yamaleela )తో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ కాలంలో హీరోయిన్ గా రాణించి తర్వాత సినిమాలకు దూరమైంది.

 Indraja About Loosing Pelli Sandadi Movie ,hello Brother ,yamaleela ,pelli Sa-TeluguStop.com

మళ్లీ లయన్, శతమానం భవతి సినిమాలతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంబ్యాక్ ఇచ్చింది.రీసెంట్ గా ప్రతినిధి 2, మారుతీ నగర్ సుబ్రమణ్యం వంటి సినిమాలో కీలకపాత్రలను పోషించి అలరించింది.

జబర్దస్త్ వంటి టీవీ షోలలో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

అందులో “మీరు రిజెక్ట్ చేసిన లేదా చేసి ఉంటే బాగుండేదే అనిపించిన హిట్ అయిన సినిమా ఏది?” అని క్వశ్చన్ చేశారు.దానికి ఆమె ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ చెప్పింది.

Telugu Brother, Pelli Sandadi, Ravali, Srikanth, Yamaleela-Movie

ఇంద్రజ సమాధానం ఇస్తూ.“కె.రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమా ( Pelli Sandadi )తీసే సమయంలో నా గురించి, నటి ఊహ గారి గురించి ఒక వార్త బాగా సర్కులేట్ అయ్యింది.అదేంటంటే ఊహ గారికి, నాకు మధ్య చాలా సెమిలారిటీస్ ఉండేవి.

ఆమె, నేనూ సేమ్ కనిపించే వాళ్లం.అందుకే మా ఇద్దరినీ అక్క చెల్లెలుగా పెళ్లి సందడి సినిమాలో తీసుకోబోతున్నారని ఒక ప్రచారం సాగింది.

కానీ అది ఎందుకు నిజం కాలేదు, మమ్మల్ని ఎందుకు ఆ సినిమాలో సిస్టర్స్ గా తీసుకోలేదు అనేది మాత్రం నాకు తెలియదు.ఒకవేళ ఆ మూవీలో మమ్మల్ని తీసుకొని ఉంటే చాలా సంతోషపడేదాన్ని.ఎందుకంటే అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.” అని చెప్పుకొచ్చింది.

Telugu Brother, Pelli Sandadi, Ravali, Srikanth, Yamaleela-Movie

1996లో విడుదలైన మ్యూజికల్ రొమాన్స్ ఫిలిం “పెళ్లి సందడి”లో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్( Ravali, Deepti Bhatnagar ) నటించారు.అంటే ఊహ, ఇంద్రజ నటించాల్సిన పాత్రలలో వీరు నటించారన్నమాట.ఈ సినిమాలో వీరిద్దరూ సిస్టర్స్ ఒకే వ్యక్తిని అంటే శ్రీకాంత్ ని ప్రేమిస్తారు.మూవీ స్టోరీ చాలా బాగుంటుంది.ఇక ఎం.ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఇందులోని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.హృదయమనే, సౌందర్య లహరి, నవ మన్మధుడా పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.ఈ మూవీ దాదాపు 30 ఏళ్ల క్రితమే బాక్సాఫీస్ వద్ద రూ.12–15 కోట్లు కలెక్ట్ చేసే చాలా రికార్డులను బ్రేక్ చేసింది.ఒక్క హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనే రూ.1.25 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమా 34 లొకేషన్లలో 100 రోజుల ఆడి శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇంత మంచి సినిమాని కోల్పోవడం నిజంగా ఇంద్రజ దురదృష్టం అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube