సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu)కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా మహేష్ బాబు సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో అని ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
అయితే సుధీర్ బాబు మహేష్ బాబు లుక్ కు సంబంధించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబుకు షర్ట్ విప్పడం, కండలు పెంచడం ఇష్టం ఉండదని సన్నగా ఉండటమే మహేష్ కు ఇష్టమని అన్నారు.మహేష్ బాబు తన చుట్టూ ఒక చట్రం పెట్టుకున్నారని అయితే జక్కన్న సినిమాకు మాత్రం మహేష్ ఎలాంటి బౌండరీస్ పెట్టుకోలేదని సుధీర్ బాబు తెలిపారు.నాకు తెలిసినంత వరకు జక్కన్నకు మహేష్ సరెండర్ అయిపోయారని ఆయన వెల్లడించడం గమనార్హం.
రాజమౌళి( Rajamouli) సినిమా కొరకు మహేష్ బాబు తనకు తాను పరిమితులు విధించుకున్నాడని ఆయన కామెంట్లు చేశారు.మహేష్ బాబు తన పరిధిని మరింత విసృతం చేసుకునే అవకాశం ఉందని తన చుట్టూ ఉన్న గోడలను మహేష్ బాబు పడగొట్టాల్సిన సమయం ఆసన్నమైందని సుధీర్ బాబు( Sudhir Babu) వెల్లడించారు.
సుధీర్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
త్వరలో వర్క్ షాప్ కండక్ట్ చేసి మహేష్ బాబు ఫైనల్ లుక్ ను డిసైడ్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.సుధీర్ బాబు వెల్లడించిన విషయాలు మహేష్ బాబు అభిమానులకు ఎంతో ఆనందాన్నికలిగిస్తున్నాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఆలస్యం అయ్యే కొద్దీ ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కు టెన్షన్ పెరుగుతోంది.
సుధీర్ బాబు మరికొన్ని రోజుల్లో మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.