తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తన స్టామినాను చూపిస్తూ వస్తున్న ఒకే ఒక హీరో రామ్ చరణ్( Ram Charan )… తండ్రికి తగ్గ తనయుడి గా గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఇప్పుడు చేయబోయే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చెంజర్ సినిమా( Game Changer ) డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోయే సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి బుచ్చిబాబు ఇంతకుముందు ఉప్పెన లాంటి ఒక చిన్న సినిమాను చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.అలాంటి బుచ్చిబాబు 500 కోట్ల బడ్జెట్ తో సినిమాని హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.మరి మొత్తానికైతే బుచ్చిబాబు( Buchi Babu Sana) తన ఎంటైర్ కెరియర్ లో రెండో సినిమాతోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

బుచ్చిబాబుకి చాలా వరకు సుకుమారైతే హెల్ప్ చేశాడు.ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టుని సెట్ చేసింది కూడా సుకుమార్ గారే కావడం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి బుచ్చిబాబు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది… ఈ సినిమాతో కనక సక్సెస్ సాధిస్తే బుచ్చిబాబు కెరియర్ అనేది మారిపోతుందనే చెప్పాలి.
పాన్ ఇండియాలో ఉన్న హీరోలందరూ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు…
.