తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా(Chitra Shukla) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ మేరకు ఆ విషయాన్ని ఆమె తెలుపుతూ ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.
తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చిత్ర శుక్లా.కానీ ఆమె అనుకున్న రేంజ్ లో మాత్రం సినిమా అవకాశాలు రాలేదు.
ఇకపోతే నాలుగు రోజుల క్రితం సెప్టెంబరు 30న రాత్రి 9:31 నిమిషాలకు బిడ్డ పుట్టాడని ఆమె తెలిపారు.ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు బాబు పుట్టడం మరింత స్పెషల్ అని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.
పెళ్లిరోజు కరెక్ట్ గా పెళ్లి సమయం డేట్ కి కొడుకు పుట్టడంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వేరేలవడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే చిత్రా శుక్లా విషయానికి వస్తే.ఇండోర్ కి చెందిన చిత్రా శుక్లా 2014 నుంచి సినిమాలు చేస్తోంది.బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా ఈమె కెరీర్ మొదలు పెట్టింది.2017లో మా అబ్బాయి ( Maa Abbayi )అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.
అలా రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్, మస్తే షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణంలో అనే అనే సినిమాల్లో నటించి మెప్పించింది.కాగా గత ఏడాది డిసెంబరులో వైభవ్ ఉపాధ్యాయ( Vaibhav Upadhyay ) అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు మగబిడ్డని ప్రసవించింది.తన ఆనందాన్ని తెలియజేస్తూ కొడుకు ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.