ప్రస్తుత చలికాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో పొడి చర్మం ముందు వయసులో ఉంటుంది.స్కిన్ డ్రై(dry skin) అవ్వడం వల్ల నిర్జీవంగా కల తప్పి కనిపిస్తుంది.
పైగా పొడి చర్మం వల్ల కొందరికి దురద కూడా పెడుతుంటుంది.ఖరీదైన మాయిశ్చరైజర్స్ ను వాడినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్(Home remedies) ఫాలో అవ్వండి.
ఈ రెమెడీస్ తో సులభంగా పొడి చర్మానికి చెక్ పెట్టవచ్చు.
రెమెడీ 1: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు(curd), వన్ టేబుల్ స్పూన్ తేనె(honey), పావు టీ స్పూన్ పసుపు(Turmeric) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీ డ్రై స్కిన్ ను రిపేర్ చేస్తుంది.చర్మాన్ని మృదువుగా మరియు తేమగా మారుస్తుంది.
రెమెడీ-2: మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు అరటిపండు స్లైసెస్(Banana slices), రెండు టీ స్పూన్లు అవకాడో పల్ప్(Avocado pulp) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు పాలు(milk) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ తేనె(honey) కలిపి ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ ఫ్రూట్ మాస్క్ స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది.పొడి చర్మాన్ని నివారిస్తుంది.మరియు స్కిన్ గ్లోయింగ్ గా మెరిసేలా కూడా ప్రోత్సహిస్తుంది.
ఇక ఈ రెమెడీస్ ను ఫాలో అవడంతో పాటుగా స్కిన్ డ్రైవ్ అవ్వకుండా ఉండేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.రోజుకు 8 గ్లాసుల నీటిని సేవించండి.స్నానం చేయడం పూర్తి చేసిన వెంటనే, మీ చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి.వేడి వేడి నీటితో స్నానం చేసే అలవాటు ఉంటే మానుకోండి.
గోరువెచ్చని నీటిని స్నానానికి ఉపయోగించండి.విటమిన్లు ఎ, సి, ఇ మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
కెఫిన్, ఆల్కహాల్ తగ్గించండి.ఎందుకంటే, మీ చర్మం నిర్జలీకరణ మరియు బిగుతుగా మారటానికి ఇవి కారణమవుతాయి.