సాధారణంగా కొందరికి లిప్స్ చుట్టూ స్కిన్ అనేది డార్క్( Dark ) గా మారుతుంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు ఈ సమస్యను చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు.
ఎండల ప్రభావం, పిగ్మెంటేషన్, హార్మోన్ ఛేంజ్, పోషకాలు కొరత, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల లిప్స్ చుట్టూ ఉన్న స్కిన్ అనేది నల్లగా మారి అసహ్యంగా కనిపిస్తుంటుంది.అయితే ఆ డార్క్ నెస్ ను వదిలించడానికి కొన్ని ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు ఉన్నాయి.
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెమెడీ 1: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( rice flour ), రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పొటాటో జ్యూస్( Potato juice ) మరియు రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( raw milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాల చుట్టూ అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే లిప్స్ చుట్టూ డార్క్ నెస్ తొలగిపోతుంది.స్కిన్ కలర్ అనేది ఈవెన్ గా మారుతుంది.బ్రైట్ గా మెరుస్తుంది.

రెమెడీ 2: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee powder ) వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు తేనె( honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెదాలు చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీ కూడా లిప్స్ చుట్టూ ఏర్పడిన నలుపును వదిలించడంలో సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.
వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను కూడా గమనిస్తారు.కాబట్టి లిప్స్ చుట్టూ డార్క్ నెస్ ఉందని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీస్ ప్రయత్నించండి.