చియా సీడ్స్(chia seeds).వీటి గురించి పరిచయాలు అక్కర్లేదు.
ఇటీవల రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే చియా సీడ్స్ నానబెట్టి తీసుకుంటున్నారు.చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ మన ఆరోగ్యానికి తోడ్పడే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్(Vitamins, minerals, antioxidants, fiber, protein, omega 3 fatty acids) చియా సీడ్స్ లో నిండి ఉంటాయి.
అటువంటి ఈ గింజలతో ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.కురుల సంరక్షణకు చియా సీడ్స్ అద్భుతంగా తోడ్పడతాయి.
మరి జుట్టుకు ఈ గింజలను ఏ విధంగా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసి అవి మునిగేలా వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు(Yogurt), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్(coconut oil) వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ చియా సీడ్స్ మాస్క్(Chia seeds mask) ను వేసుకుంటే మస్తు లాభాలు పొందుతారు.చియా సీడ్స్ లో జింక్, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు నిండి ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదల మరియు బలానికి తోడ్పడతాయి.కురులను ఒత్తుగా, పొడుగ్గా మారుస్తాయి.
అలాగే చియా సీడ్స్ లో కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.ఇది జుట్టును రక్షిస్తుంది.కురులకు మెరిసే రూపాన్ని అందిస్తుంది.చియా సీడ్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు (omega 3 fatty acids)ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.స్కాల్ప్ ఇన్‌ఫ్లమేషన్‌ను సైతం తగ్గిస్తాయి.ఇక పెరుగు, కొబ్బరి నూనె కూడా కురుల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.