ఖర్జూరం, తేనె.ఇవి రెండు మధురమైన రుచితో పాటు మన ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి.
అయితే ఖర్జూరం, తేనె విడివిడిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయని అందరికీ తెలుసు.అయితే ఖర్జూరం, తేనె(dates with honey) కలిపి తీసుకుంటే అంతకు రెట్టింపు లాభాలు పొందుతారు.
అందుకోసం ముందుగా పది ఖర్జూరాలను గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఆ గ్లాస్ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి.
అలాగే ఐదారు టేబుల్ స్పూన్లు తేనె వేసి మూత పెట్టి బాగా షేక్ చేసి నాలుగు రోజుల పాటు కదపకుండా ఒకచోట పెట్టాలి.
ఈ విధంగా తేనెలో ఊరబెట్టిన ఖర్జూరాన్ని రోజుకు ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
ఇలా ఖర్జూరం, తేనె కలిపి తీసుకోవడం వల్ల హెల్త్ కు చాలా మంచిది.తక్షణ శక్తిని పొందడానికి ఈ కాంబినేషన్ ఉత్తమంగా సహాయపడుతుంది.ఖర్జూరం, తేనె కలయిక వాటి సహజ చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా స్థిరమైన మరియు త్వరిత శక్తిని పొందుతారు.అలాగే ఖర్జూరం, తేనెలో(Hony, dates) ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
దగ్గు, జలుబు(Cold, Cough) వంటి సీజనల్ వ్యాధుల నుంచి వేగంగా ఉపశమనాన్ని అందిస్తాయి.
తక్కువ బరువు ఉన్నవారు, వెయిట్ గెయిన్ (Weight gain)అవ్వాలని భావిస్తున్నవారు ఖర్జూరం, తేనె కలిపి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది.ఈ కాంబినేషన్ వెయిట్ గెయిన్ కు సహజ మార్గం.ఖర్జూరం-తేనె కలిపి తీసుకుంటే.
జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మలబద్ధకం(Constipation) మరియు ఇతర జీర్ణశయాంతర పరిస్థితుల నుండి బయటపడతారు.
ఖర్జూరం మరియు తేనె కలిపి తీసుకుంటే శరీరంలో మంట తగ్గుతుంది.
అంతేకాకుండా ఖర్జూరం, తేనె కాంబినేషన్ హృదయ సంబంధ (Cardiovascular)వ్యాధులను నివారించడానికి మరియు స్ట్రోక్ (Stroke)ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.మరియు ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి.