అతిపెద్ద కోడిపుంజు-ఆకారపు బిల్డింగ్ ఎప్పుడైనా చూశారా.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది..

ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన రెస్టారెంట్లు, హోటల్స్, రిసార్ట్స్ ఉన్నాయి.కొన్ని హోటళ్ల ఆకారాలు విడ్డూరంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

 Have You Ever Seen The Largest Chicken-shaped Building.. World Record Is Broken.-TeluguStop.com

అయితే ఫిలిప్పీన్స్‌(Philippines) దేశం, నీగ్రోస్ ఆక్సిడెంటల్‌ మునిసిపాలిటీలోని కాంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్‌లో(Campuestohan Highland Resort) ఓ వింత భవనం ఉంది.అది అతి పెద్ద కోడిపుంజు ఆకారంలో ఉంటుంది.

ఈ భవనం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటుంది.

ఈ విశాలమైన భవనం 34.9 మీటర్ల ఎత్తు, 12.1 మీటర్ల వెడల్పు, 28.2 మీటర్ల పొడవు ఉంటుంది.దీని లోపల 15 గదులు ఉన్నాయి.

ప్రతి గదిలో ఎయిర్ కండిషనింగ్, పెద్ద పడకలు, టీవీలు, స్నానాల గదులు వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి.ఫిలిప్పీన్స్‌కు వెళ్లి అద్భుతమైన భవనాలను చూడాలనుకునే వారికి ఈ కోడి ఆకారపు భవనం(Chicken-Shaped Building) తప్పకుండా నచ్చుతుంది.

నెగ్రోస్ ఆక్సిడెంటల్‌లోని కంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారపు భవనం గురించి మీకు తెలుసు కదా? ఈ అద్భుతమైన ఆలోచన రికార్డో కానో గ్వపో తాన్‌కి వచ్చింది.ఈ రిసార్ట్‌ కోసం భూమిని కొన్నది ఆయన భార్యే.

ఈ భవనాన్ని నిర్మించడానికి చాలా కాలం పట్టింది.దీన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు ఆరు నెలలు పాటు ప్లాన్ చేశారు.

చివరకు 2023 జూన్ 10న ఈ భవన నిర్మాణం మొదలైంది.దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారపు భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సొంతం చేసుకుంది.

ఈ రికార్డును 2024 సెప్టెంబర్ 8న అధికారికంగా ప్రకటించారు.

ఈ ప్రాంతంలో తరచూ వచ్చే భారీ తుఫానులు, చుట్టుముట్టే ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవనాన్ని నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.కాంప్యూస్టోహాన్ హైలాండ్ రిసార్ట్‌లో(Compustohan Highland Resort) ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారపు భవనాన్ని ఎందుకు నిర్మించాలని అనుకున్నారు అని రికార్డో కానో గ్వపో తాన్‌ను అడిగినప్పుడు, ఆయన సమాధానమిస్తూ “నెగ్రోస్ ఆక్సిడెంటల్‌లో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.దీని వల్ల ఫిలిప్పీన్స్‌లోని లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది.

కోడిపుంజు చాలా ప్రశాంతంగా, బలంగా ఉంటుంది.అలాగే అది ఒక నాయకుడిలా కనిపిస్తుంది.

మన ప్రజల స్వభావం కూడా అలాంటిదే.మనుషుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక అద్భుతమైన నిర్మాణాన్ని నేను సృష్టించాలనుకున్నాను” అని అన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భవనం ఫోటోలను పంచుకుంటూ, “ప్రపంచంలోనే అతిపెద్ద కోడి ఆకారపు భవనం(Chicken-Shaped Building) ఇదే” అని రాశారు.ఈ పోస్ట్ చూసిన చాలా మంది నవ్వుతూ కామెంట్లు చేశారు.ఒకరు, “అది కోడి కాదు, అది కోడిపుంజు” అని అన్నారు.మరొకరు, “ఆ భారీ కోడిలో భవనం ఏ భాగంలో ఉంది?” అని ప్రశ్నించారు.మరొకరు, “గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్(World record is broken) ఎప్పుడూ విచిత్రమైనవే అని నేను అనుకుంటాను, ఈ పోస్ట్ అది నిజమే అని నిరూపిస్తోంది” అని కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube