కేరళ కాలేజీలో హెచ్ఓడీ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్.. వీడియో వైరల్..

ఇటీవల కాలంలో కాలేజీ ఫంక్షన్లలో విద్యార్థులు అదిరిపోయే డ్యాన్సులు వేస్తూ తమ సత్తా చాటుతున్నారు.అలానే మిగతా విద్యార్థులను బాగా అలరిస్తున్నారు.

 Hod Electrifying Dance In Kerala College.. Video Viral.., Viral Dance Video, Tea-TeluguStop.com

అయితే కొన్ని కాలేజీలలో టీచర్లుTeachers colleges), కాలేజీ స్టాఫ్ డాన్సులు వేస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు.మామూలుగా కనిపించే వీరిలో ఇంత మంచి డాన్సర్లు ఉన్నారా అని అందర్నీ ఆశ్చర్యపోయేలాగా చేస్తున్నారు

కేరళ రాష్ట్రం(Kerala), అలప్పుజ పట్టణంలోని సనతానా ధర్మ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలో(Fresher’s Day celebration) ఇలాంటి సీన్ రిపీట్ అయింది.

ఈ కాలేజీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో, డిపార్ట్‌మెంట్ హెడ్ (హెచ్‌ఓడీ) (HOD)విద్యార్థులతో కలిసి వేదికపై ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ చేయడం చూడవచ్చు.

ఈ వీడియోను విద్యార్థి అమల్ వి నాథ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇది ఇప్పటికే కొన్ని మిలియన్ల వ్యూస్‌ను అందుకుంది.ఈ క్లిప్‌లో, విద్యార్థుల గ్రూప్ రాజకిణి నటించిన ‘వెట్టయన్’ సినిమాలోని ‘మనసిలాయో’ పాటకు డాన్స్ చేస్తున్నారు.

కొద్ది సెకన్లకు హెచ్‌ఓడీ వీనేత్ విసి వేదికపై ఆ స్టూడెంట్స్ డాన్స్ గ్రూప్‌లో చేరారు.ఆయన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచాయి, ప్రేక్షకులు బిగ్గరగా చప్పట్లు కొట్టారు.

ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ వీడియోను “POV: వెన్ యువర్ HOD మ్యాచెస్ యువర్ వైబ్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.ఈ వీడియో పోస్ట్ కింద చాలామంది ఫైర్, హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేశారు.

“హెచ్‌ఓడీ రాక్ చేశారు, విద్యార్థులు షాక్ అయ్యారు” అని ఒక యూజర్ జోక్ చేశారు.“ఈ రకమైన హెచ్‌ఓడీని ఎక్కడ కనుక్కోగలం?” అని మరొకరు అడిగారు.“బ్రో దగ్గర మస్త్ మూవ్స్ ఉన్నాయి” అని మరొక యూజర్ కామెంట్ చేశారు.“ఓ మై గాడ్… ఇదే హెచ్‌ఓడీ అంటే ఇదే” అని మరో యూజర్ అన్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ ఒక విద్యార్థి, ఆయన ఉపాధ్యాయుడు కలిసి బాలీవుడ్ పాట ‘ఉప్ వాలా తమ్కా’(‘Up Wala Tamka’)కు డ్యాన్స్ చేసి అదరగొట్టారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.ఈ వీడియోలో, విద్యార్థి మొదట డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు, ఆ తర్వాత ఉపాధ్యాయుడు వేదికపై చేరుకుంటాడు.ఇద్దరూ బ్లాక్ షర్ట్‌లు, ప్యాంట్‌లు ధరించి ఓకే రిథమ్‌లో అద్భుతంగా డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube