వ్యాయామం.మనకు ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆరోగ్యాన్ని పెంచడమే కాదు, అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలోనూ వ్యాయామాలు ఉపయోగపడతాయి.ముఖ్యంగా అధిక బరువును నివారించడంలోనూ, గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ను తగ్గించడంలోనూ, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ.
ఇలా చెప్పుకుంటే పోతే వ్యాయామాల ద్వారా చాలా ప్రయోజనాలనే పొందొచ్చు.అందుకే ఇటీవల రోజులు హెల్త్, ఫిట్ నెస్‌పై శ్రద్ధ చూపుతున్న వారందరూ రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు.

అయితే వ్యాయామాలు చేసే ముందు వార్మప్స్ చేయమని నిపుణులు చెబుతుంటారు.వార్మప్స్ ఎందుకు చేయాలి.? వార్మప్స్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటీ.? అని చాలా మందికి తెలియదు.ఇప్పుడు ఆ విషయాలనే తెలుసుకోబోతున్నాం.మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
బాడీ ఫ్లెక్సిబిల్‌గా లేకుండా వ్యాయామాలు చేయడం కాస్త కష్టంగా ఉంటుంది.అయితే ఎక్సర్‌సైజ్ చేయడానికి ముందే వార్మప్స్ చేయడం వల్ల శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
దాంతో ఎటు వంటి వ్యాయామాలను అయినా సులువుగా చేయవచ్చు.
అలాగే ఎక్సర్ సైజ్ చేసిన తర్వాత కండరాలు తీవ్రంగా నొప్పి పుడుతుంటాయి.
కానీ, వర్కౌట్ కు ముందు చక్కగా వార్మప్ చేయడం అలవాటు చేసుకుంటే కండరాల నొప్పి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.అదే సమయంలో బరువైనవి ఎత్తినప్పుడు కండరాలు నొప్పి కలగడం, పట్టేయడం వంటి రిస్కులు తలెత్తకుండా ఉంటాయి.

వ్యాయామాలు చేయడానికి ముందు వార్మప్స్ చేయడం వల్ల శరీరంలోని కణజాలాలన్నింటికీ సమానంగా ఆక్సిజన్ అందుతుంది.దాంతో రక్తసరఫరా పెరగడమే కాదు.గుండె స్పందన, శ్వాస క్రియా రేటు సైతం మెరుగ్గా మారతాయి.ఇక వార్మప్స్ చేస్తేనే ఎక్సర్‌సైజ్‌తో పూర్తి ప్రయోజనాలు పొందుతారు.కాబట్టి, ఇకపై వ్యాయామాలు చేయడానికి ముందు ఖచ్చితంగా వార్మప్స్ చేయండి.