న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఈడీ ఆఫీసుల ముందు రేపు కాంగ్రెస్ నిరసన

  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు రేపు చేపట్టనుంది. 

2.షర్మిల కామెంట్స్

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మడుపల్లి గ్రామస్తులతో షర్మిల పాదయాత్రలో భాగంగా మాట్లాడారు.ఉద్యమకారుడు కదా అని కెసిఆర్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పుడు చెబితే ఎనిమిదేళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.  ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోంది అంటూ విమర్శలు చేశారు. 

3.సినీ నిర్మాణ సంస్థ పై కేసు

  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, శ్రేయాస్ మీడియా పై శుక్రవారం మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.తగిన అనుమతులు లేకుండా ‘ అంటే సుందరానికి ‘ ఫ్రీ రిలీజ్ వేడుక ఈ నెల 9న మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించడం పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 

4.తెలంగాణ లో ప్రారంభమైన టెట్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మొదలైంది.ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్ మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు.మొత్తం 2683 సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. 

5.నేడు 34 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 12న ఆదివారం వివిధ మార్గాల్లో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

6.ఆర్టీసీ పరిరక్షణ సదస్సుకు పక్షాలను ఆహ్వానించిన జేఏసీ

  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనల 14న జరిగే ఆర్టిసి రక్షణ – కార్మికుల హక్కుల పరిరక్షణ సదస్సులో పాల్గొని సలహాలు , సూచనలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధి బృందం విపక్షాల పార్టీ నాయకులను ఆహ్వానించింది. 

7.ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్

  ఐదేళ్లలోపు పిల్లలకు ఇంటి వద్దనే ఆధార్ నమోదు కు తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది. 

8.కెసిఆర్ కు మమత ఫోన్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు విపక్షాల అధినేతలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 17న ఢిల్లీలో తలపెట్టిన సమావేశానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. 

9.మద్యం పై రఘురామ కామెంట్స్

  ఎన్నికలకు ముందు పాదయాత్ర నిర్వహించిన జగన్ ఆ సమయంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మద్యంపై మాట తప్పినందుకు ఏం చేస్తారు అంటూ జగన్ ను ఉద్దేశించి రఘురామ కామెంట్స్ చేశారు. 

10.సంపూర్ణ మద్యపాన ప్రదేశ్ అంటూ లోకేష్ …

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తమని ప్రకటించారని , కానీ సంపూర్ణ మధ్య ప్రదేశ్ గా మార్చారు అని జగన్ ప్రభుత్వం పై నారా లోకేష్ విమర్శలు చేశారు. 

11.నేడు భీమవరంలో కేంద్ర మంత్రి పర్యటన

  నేడు భీమవరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు.జూలై 4న భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్న నేపథ్యంలో మా ఏర్పాట్లను సమీక్షించేందుకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. 

12.తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.శనివారం తిరుమల శ్రీవారిని 87,698 మంది భక్తులు దర్శించుకున్నారు. 

13.ఏపీలో మద్యం అమ్మకాలపై పవన్ కామెంట్స్

  ఏపీలో సంపూర్ణ మధ్య నిషేదం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు.సంపూర్ణ మధ్య నిషేధం కాదు కాదు సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం అంటూ సెటైర్స్ వేశారు. 

14.టీటీడీ జేస్టాభిషేకం టికెట్ల విడుదల

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

నేటి నుంచి టీటీడీ జేష్ఠభిషేకం సేవల టికెట్లను విడుదల చేయనుంది.కరెంట్ బుకింగ్ లో రోజుకి 600 చొప్పున మూడు రోజుల పాటు జస్ట్ అభిషేకం టిక్కెట్లను విడుదల చేయనుంది. 

15.నేడు విశాఖ లో కేంద్ర మంత్రి పర్యటన

  నేడు విశాఖ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా ఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరినా లో అర్బన్ మిషన్ పై సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో ఏపీ మంత్రి జోగి రమేష్ పాల్గొననున్నారు. 

16.పసుపు సాగులో దేశంలో నిజామాబాద్ నెంబర్ వన్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

పసుపు సాగులో దేశంలో నిజామాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు. 

17.నవీన్ జిందాల్ వినతి

  మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యల నేపథ్యంలో బిజేపి బహిష్కృత నేత నవీన్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తనకు సంబందించిన ఏ సమాచారాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయవద్దు అని ఆయన కోరారు. 

18.వివేకా హత్య కేసుపై రఘురామ కామెంట్స్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు గా ఉన్న ముగురు వ్యక్తులు ఇప్పటికే చనిపోయారని, మిగిలినవారిని అయినా కాపాడాలి అని రఘురామ కోరారు. 

19.ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Mahendranath, Lokesh, Naveen Jindal, Rahul Gandhi,

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,360
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,260

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube