వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!

అరటిపండు( Banana ) తినడం వచ్చా? అని మీలో ఎవరినన్నా అడిగితే ఏం చెబుతారు? అయ్యో! అదేం ప్రశ్న? మీకేం పిచ్చి పట్టుకోలేదు కదా.అని సమాధానం వస్తుంది.

 Woman Ate Banana With Fork Video Viral Details, Woman, Ate Banana ,banana , Fork-TeluguStop.com

అయితే ఇక్కడ తినడం గురించి కాదు.ఎలా తిన్నామన్నదే ప్రశ్న.

అదేంటి మళ్ళీ ఎలా తినాలి అంటున్నారు.అన్ని పండ్లలో అరటి పండ్లు తినడం చాలా తేలిక కదా అంటారా? అదిగో అక్కడికే వస్తున్నా… సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత జనాలు చాలా ఘోరంగా తయారయ్యారు.మరీ ముఖ్యంగా ఏదో ఒకటి చేసి, తొందరగా ఫేమస్ అయిపోవాలనే జనాల సంఖ్య ఇక్కడ ఎక్కువైంది.అవును, ఈ క్రమంలోనే ఓ మహిళ( Woman ) అరటిపండుని తినే వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది.

అవును, ఒక మహిళ అరటి పండును అందరిలా కాకుండా విచిత్రంగా తినడం చూసి జనాలు షాక్ అవుతున్నారు.ఈ వీడియో చూసిన వారంతా.‘‘అరటి పండును ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది సుమీ!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక చాలా మంది ధనవంతులు తినే సమయంలో స్పూన్లు, ఫోర్క్‌లు ఎక్కువగా వాడుతూ ఉంటారు.

ఇక అరటిపండును తినేటప్పుడు ఎవరైనా ఇలా తొక్క తీసి పక్కన పడేసి, అలా తినేస్తుంటారు కదా.అయితే అరటి పండును కూడా చేత్తో టచ్ చేయకుండా ఎలా తినాలో ఓ మహిళ చేసి చూపించింది.అవును, ముందుగా ఆమె ప్లేటులో అరటిపండు పెట్టి.ఓ కత్తి,( Knife ) ఫోర్క్( Fork ) తీసుకుని దాని తొక్కను నైస్‌గా కట్ చేసేసింది.తర్వాత ఫోర్క్ సాయంతో తొక్కను తీసేసి పండును తినేసిందన్నమాట.

కాగా సదరు వీడియోని చూసిన జనాలు మాత్రం ఆమెపై అవాక్కులు, చెవాక్కులు పేల్చుతున్నారు.అరటి పండును ఇలా విచిత్రంగా తినడం చూసి అంతా అవాక్కవుతున్నారు.దాంతో సదరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.‘‘ఎంత ధనవంతులైతే మాత్రం అరటిపండును ఇలా కూడా తింటారా?’’ అని కొందరు కామెంట్ చేస్తే, ‘‘అరటిపండును ఇలాక్కూడా తినొచ్చని మాకు ఇప్పుడే తెలిసింది.మీ దయ వలన!’’.అంటూ మరికొందరు, వామ్మో ఇదెక్కడి చోద్యం.ఇలా కూడా తింటారా? మీరు ఉండవలసిన వారే! అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube