పచ్చిమిర్చిని రోజూ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తెలుసుకోండి!

రోజువారీ కూరల్లో కారం కోసం పచ్చిమిర్చిని( green chillies ) వాడుతూనే ఉంటారు.ముఖ్యంగా ప్రతి భారతీయ ఇల్లు పచ్చి మిరపకాయలను వినియోగిస్తుంది.

 Amazing Health Benefits Of Eating Green Chilli! Green Chilli, Green Chilli Healt-TeluguStop.com

కొందరు పచ్చిమిర్చిని పచ్చిగానే తినేస్తూ ఉంటారు.ఇంకొందరు పచ్చిమిర్చి పేరు వింటే చాలు ఆమడ దూరంలో ఉంటారు.

పచ్చిమిర్చిని వాడేందుకు పెద్దగా ఇష్టపడరు.కానీ నిత్యం పచ్చిమిర్చిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే పచ్చి మిరపకాయలు ఘాటైన రుచితో పాటు బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటాయి.అందువల్ల అవి మనకు బహుళ ప్రయోజనాలు చేకూరుస్తాయి.

మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) మరియు విటమిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి6 వంటి పోష‌కాలు అధిక మొత్తంలో ఉంటాయి.

ఇవి శ‌రీరంలో కణాలను దెబ్బతీసే మరియు కొన్నిసార్లు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే ఫ్రీ రాడికల్స్ ను నాశ‌నం చేస్తాయి. స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం, ఆర్థరైటిస్ ( Stroke, cancer, diabetes, arthritis )మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తాయి.

అలాగే పచ్చి మిరపకాయల్లో శరీర జీవక్రియ రేటును పెంచే థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి.అందువల్ల రోజూవారీ ఆహారంలో పచ్చిమిర్చిని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.

Telugu Benefitsgreen, Green Chilli, Greenchilli, Tips, Latest, Vitamin-Telugu He

పచ్చి మిరపకాయలలో బీటా కెరోటిన్( Beta carotene ) ఉంటుంది, ఇది హృదయనాళ వ్యవస్థ యొక్క సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.అదే స‌మ‌యంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగిస్తుంది.పచ్చి మిరపకాయలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి మరియు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్ప‌డ‌తుంది.అలాగే ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి, ఇవి మానసిక స్థితిని మెరుగుప‌రుస్తాయి.

ఉల్లాసమైన మూడ్‌కి దారి తీస్తాయి.

Telugu Benefitsgreen, Green Chilli, Greenchilli, Tips, Latest, Vitamin-Telugu He

అంతేకాదు పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి( Vitamin C ) పుష్కలంగా ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేస్తుంది.జ‌లుబుతో బాధ‌పడుతున్న వారికి కూడా ప‌చ్చిమిర్చి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.పచ్చి మిరపకాయలోని క్యాప్సైసిన్ అనే సమ్మేళనం జలుబుతో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube