టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి( Rajamouli ) తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా నిలిచాడు కొరటాల శివ కానీ ఎప్పుడైతే ఆయన కెరీర్‌లో ఆచార్య సినిమా వచ్చిందో ఆయనకున్న ట్రాక్ రికార్డు అంతా తలకిందులు అయింది.సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనే పేరు కాస్త పోయి డిజాస్టర్ అని పేరు పడింది.
తర్వాత దేవర సినిమాతో మళ్లీ కెరీర్ ను కాపాడుకోగలిగాడు కానీ ఈ సినిమాలో కూడా ఆయన రచన, దర్శకత్వం బాగోలేదని విమర్శలు వస్తున్నాయి ఈ సినిమా బాగా ఆడిందంటే దానికి కారణం ఎన్టీఆర్ యాక్టింగే అని చాలామంది అంటున్నారు.తారక్ దేవర సినిమాని కాపాడటం వల్లే కొరటాల శివ ఈసారి బయటపడగలిగాడని పేర్కొంటున్నారు.
ఆచార్య సినిమాలో పాదఘట్టం అనే పదం పదే పదే వాడగా దేవరాజ్ సినిమాలో ఎర్ర సముద్రం అనే పదం పదే పదే వాడి చిరాకు పుట్టించారు.
నిజానికి కొరటాల శివ( Koratala Shiva) స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదగడమే ఒక ఆశ్చర్యకరం.ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రభాస్, తారక్ లతో ఉన్న కుదిరిన స్నేహమే అని చాలామంది చెబుతుంటారు.కొరటాల శివ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మే సోషల్ యాక్టివిస్ట్‌ల కుటుంబంలో జన్మించాడు.
ఆయన తన కెరీర్ ను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప్రారంభించాడు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కెరీర్ చాలా ప్రాఫిటబుల్ గా సాగినా సరే “ఇది కాదు నా లైఫ్” అని అనుకున్నాడు.
ఆ తర్వాత అతను తన అంకుల్ పోసాని కృష్ణ మురళి దగ్గర సినిమాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు.తర్వాత ఒక్కడున్నాడు, భద్ర, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి చిత్రాలకు అద్భుతమైన డైలాగులు రాసిచ్చాడు.
మున్నా సినిమా( Munna ) తీసేటప్పుడు ప్రభాస్ తో స్నేహం ఏర్పడింది.బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు డైలాగ్ రైటర్ గా పని చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ తో ఫ్రెండ్‌షిప్ కుదిరింది.ఆ స్నేహం కారణంగానే కొరటాల శివతో మిర్చి సినిమా చేయడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడు.ఈ మూవీ సూపర్ హిట్ అయింది.ప్రభాస్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ చాలామందికి నచ్చింది.ఈ మూవీలో ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు కొరటాల శివ.ఇక ఎన్టీఆర్ కొరటాల శివతో కలిసి “జనతా గ్యారేజ్” సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
మళ్లీ దేవర సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు ఇది కూడా కమర్షియల్ గా హిట్ అయింది.ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లతో చేసిన ఈ మూడు సినిమాలే కొరటాల శివను లైఫ్ లో బాగా టర్న్ చేశాయి.
అతని తలరాతను మార్చేశాయి.మహేష్ బాబు( Mahesh Babu)తో కూడా ఆయన రెండు హిట్స్ కొట్టాడు.
అవి కూడా ఆయన కెరీర్ లైఫ్ లో మైలురాళ్లుగా నిలిచాయి.స్నేహం అనేది ఒకరి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో కొరటాల కెరీర్ లైఫ్ ను చూస్తేనే అర్థమవుతుంది.