బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో జోర్దార్ సుజాత( Jordar Sujathaa ) రాకింగ్ రాకేష్ ( Rocking Rakesh ) ఒకరు.ఈ కార్యక్రమాల ద్వారా రాకింగ్ రాకేష్ తన అద్భుతమైన స్కిట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
అనంతరం జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ టీమ్ లో కమెడియన్ గా సందడి చేస్తూ ఆయనతో ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెద్దల సమక్షంలో గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం తర్వాత వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమం తో పాటు ఇతర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా రాకేష్ హీరోగా సినిమాలలో నటించారు అదేవిధంగా సుజాత పలు వెబ్ సిరీస్లలో నటించి ఎంతో మంచి గుర్తింపు అందుకున్నారు.ఇకపోతే సుజాత పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎక్కడా ఎవరికీ చెప్పలేదు ఇటీవల తన సీమంతపు ఫోటోలను రాకేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం తెలిసింది.
ఇలా ప్రెగ్నెన్సీ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచిన ఈ జంట తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని కూడా చాలా సీక్రెట్ గా ఉంచారు.ఇటీవల బేబీ బంప్ ఫోటోలతో కనిపించిన సుజాత తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలను చూస్తే కనుక ఈమె డెలివరీ అయ్యారని తెలుస్తుంది.బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈమె సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేశారు.
దీంతో సుజాత డెలివరీ అయ్యారా అసలు తనకు బాబు పుట్టారా లేక పాప పుట్టారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు ఏ చిన్న విషయమైనా వెంటనే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు కానీ సుజాత రాకేష్ దంపతులు మాత్రం తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఇప్పటివరకు రివీల్ చేయకపోవడంతో ఇలా సీక్రెట్ గా ఉంచడానికి కారణం ఏంటని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ జంట తల్లిదండ్రులుగా మారారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
.