టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జు( Akkineni Nagarju )న కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.గత రెండు రోజులుగా ఇదే వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు తెలుగు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ఆమె వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆమెపై మండిపడిన విషయం తెలిసిందే.నాగార్జున అమల తో పాటుగా నాని ఎన్టీఆర్ కుష్బూ ఇంకా చాలామంది సెలబ్రిటీలు స్పందించారు.
అంతేకాకుండా నాగార్జున తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానంలో పరువు నష్టం దావా కేసును నాగార్జున వేశారు.
అయితే నేడు విచారణ జరగాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది.న్యాయమూర్తి సెలవులో ఉండటంతో సోమవారం విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది.తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్( KTR )ను విమర్శించే క్రమంలో కొండ సురేఖ ఈ వ్యాఖ్యలే చేశారు.
అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ సినీనటి సమంత( Samantha ) విడాకులు, రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి వంటి అంశాలపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది.
అధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు రియాక్ట్ అయ్యారు.ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలికి చాలామంది సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు.అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందించడంతో కొండా సురేఖ స్పందిస్తూ కాస్త వెనక్కు తగినట్టుగా తెలుస్తోంది.
అక్కినేని అభిమానులు సైతం ఈ విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో కొండా సురేఖ పై ట్రోల్స్ చేస్తున్నారు.ఆమె అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలపాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.