అరబ్ దేశాల్లో( Arab countries ) ఇప్పుడు ఎక్కువయ్యి వాటితో ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు ప్రజలు.అత్యంత క్రూరమైన సింహాలు, పులిలను కూడా తెచ్చి పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.
వాటిని పెంచడానికి లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తుంటారు.వారు వాటిని పెంపుడు జంతువులుగా ట్రీట్ చేస్తున్న వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోల్లో సింహాలతో వారు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారో కనిపిస్తుంది.అయితే వాళ్లు మాత్రం ఇవి తమ సంపదకు చిహ్నంగా భావిస్తారు.
అయితే, ఈ వీడియోలు చాలా ప్రమాదకరమైన పరిణామాలను సూచిస్తున్నాయి.అడవిలో పెరగాల్సిన జంతువులను ఇంటిలో పెంచడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలు స్పష్టంగా చూపిస్తున్నాయి.తాజాగా ఇలాంటి మరొక షాకింగ్ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో, ఒక ఆడ సింహం ఒక వ్యక్తిపై అటాక్ చేసింది.
ఆ వ్యక్తి కాళ్లను చీల్చి చండాడాలని అది ప్రయత్నించింది.అతను అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు.
ఈ ఘటన, కౄర జంతువులతో ఆడుకోవడం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపిస్తుంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితుడిని సింహం దగ్గరకు తీసుకెళ్లి దాడి చేయించే ప్రయత్నం చూడవచ్చు.ఈ క్లిప్‌ని “Pagepostinganimalattacks” ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసింది.వీడియోలో, ఆ వ్యక్తి ఆడ సింహాన్ని ఉద్దేశించి కోపం తెప్పించే చేష్టలు చేశాడు.
తన స్నేహితుడిపై దాడి చేసేలా సింహాన్ని ఉసిగొలిపాడు.అతను తన స్నేహితుడిని సింహం దగ్గరకు నెట్టివేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.
లయన్ వెంటనే ఆ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించింది.అతని దుస్తులను చింపివేసింది.
అతను అక్కడి నుండి తప్పించుకోవడంలో సఫలమయ్యాడు.ఈ దృశ్యాలు చూసిన వారంతా భయంతో స్టన్ అయిపోయారు.
ఈ వీడియోలోని వ్యక్తుల ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.వన్యప్రాణులను( Wildlife ) పెంపుడు జంతువులుగా పెంచడం వల్ల కలిగే ప్రమాదాల గురించి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.“వన్యప్రాణులను పెంచుకున్నందుకు ఇదే ఫలితం! దాన్ని విడిచిపెట్టండి!!!” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.“సింహాలను పెంపుడు జంతువులుగా పెంచడం మనం ఆపాలి” అని మరొకరు అన్నారు.“వీరికి డబ్బు ఎక్కువ, చేయడానికి పని లేదు” అని మరొకరు వ్యాఖ్యానించారు.ఇలా చాలామంది అడవి జంతువులను వినోదం కోసం ఉపయోగించుకోవడం తప్పు అని అభిప్రాయపడుతున్నారు.